‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌

ప్రజా గాయకుడు గద్దర్‌ పాటలు ఎంతో చైతన్యవంతంగా ఉంటాయి. అందర్నీ మేలుకొలిపే విధంగా ఉంటాయి. అలాంటి ఎన్నో అద్భుతమైన పాటల ద్వారా ప్రజా గాయకుడిగా పేరు తెచ్చుకున్న గద్దర్‌ ఇప్పుడు ‘మేలుకో రైతన్నా.. మేలుకో’ అంటూ మరో సందేశాత్మక గీతంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ చిత్రంలోని ఈ పాటను రచించి గానం చేశారు. యువతరాన్ని రైతాంగంతో కలిసి నడవమని చెప్పే చక్కని సందేశంతో కూడిన ఈ పాటలో గద్దర్‌ స్వయంగా నటించడం విశేషం.

ఈ పాట గురించి ప్రజా గాయకుడు గద్దర్‌ మాట్లాడుతూ – ”సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ చిత్రంలో ‘మేలుకో
రైతన్నా.. మేలుకో.. నువ్వు కోలుకో రైతన్నా.. కోలుకో’ అనే పాటను రచించి పాడాను.
అలాగే సినిమాలోని ఆ పాటలో నేను నటించడం కూడా జరిగింది. యువతరాన్ని రైతాంగంతో కలిసి నడవమని చెప్పే మంచి పాటను రాసి నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌ శేఖర్‌ రాజు, దర్శకుడు రాజశేఖర్‌గారికి వందనాలు. రైతుల గురించి మంచి సందేశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రేపు ప్రజల్లోకి వెళ్లి ఆ రైతాంగాన్ని కదిలిస్తుందని నమ్ముతున్నాను” అన్నారు.

సుడిగాలి సుధీర్‌హీరోగా, ధన్యాబాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం-1గా కె.శేఖర్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు