కీర్తి సురేష్, రాంచరణ్ ల మధ్య తీవ్ర పోటీ !

దోహా వేదిక అయింది. ఆగ‌స్టు 15, 16 తేదిల్లో రెండు రోజుల పాటు సెల‌బ్రిటీల గుభాళింపుల‌తో ఖాతర్ వేడెక్క‌నుంది. ఇప్ప‌టికే నామినేష‌న్లు కూడా రిలీజ్ చేసారు. తెలుగు నుంచి ఉత్త‌మ చిత్రాలు గా భ‌ర‌త్ అనే నేను, గీత‌గోవిందం, అరవింద స‌మేత వీర‌రాఘ‌వ‌, రంగ‌స్థలం, మ‌హాన‌టి చిత్రాలు పోటీ ప‌డుతున్నాయి.

ఇంకా ప‌లు విభాగాల‌కు సంబంధించిన నామినేష‌న్ ఉన్నాయి. అయితే ఉత్త‌మ చిత్రం ఏ సినిమాకు వ‌రిస్తుందన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈసారి అవార్డు ప్ర‌క‌టించ‌డం జ్యూరీ స‌భ్యుల‌కు పెద్ద ప‌రీక్షే. ఎందుకంటే పోటీ ప‌డుతోన్న చిత్రాల‌న్నీ టాప్ లో ఉన్నావే. అయితే మూడు సినిమాల మ‌ధ్య పోటీ గ‌ట్టిగా ఉండే అవ‌కాశం ఉంది.  ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే? మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన భ‌ర‌త్ అనే నేను 150 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఇది సందేశాత్మ‌క చిత్రం. ప్ర‌తీ ఒక్క‌రికి భ‌యం , బాద్య‌త అనేది ఉండాల‌ని చెప్పిన సినిమా.

మ‌హేష్ ముఖ్య‌మంత్రి పాత్ర పోషించిన సినిమాగా ఓ రికార్డు ఉంది. ఈ సినిమా ప‌క్క‌నబెడితే నాన్ బాహుబ‌లి రికార్డులు సృష్టించిన సినిమా రంగ‌స్థ‌లం. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమా 200 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. బాహుబ‌లి త‌ర్వాత భారీ వ‌సూళ్ల చిత్రం ఇదే. ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా అంచ‌నాలు సంచ‌ల‌నాలు చేసింది. ఈ హిట్ చ‌ర‌ణ్ ఇమేజ్ ను మ‌రింత పెంచింది. ఓవ‌ర్సీస్ మార్కెట్ ను రెట్టింపు చేసిన చిత్రం. ఈ సినిమాకు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో అవార్డులు రావ‌డం ఖాయం చిరంజీవి జోస్యం చెప్పారు.

ఇక మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన మ‌హాన‌టి ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. రిలీజ్ అనంత‌రం మ‌హాన‌టి అభిమానుల‌కు కొంద‌రు ద‌ర్శ‌కుడికి ప్ర‌త్యేకంగా లేఖ‌రు రాసి మ‌రి అభినంద‌న‌లు తెలిపారు. ప్ర‌పంచ‌మే మ‌హాన‌టి గురించి మాట్లాడింది. ఆసియా ఖండం స్థాయిలో అవార్డ‌లు..రివార్డులు అందుకుంది. ఇంత మంది పోటీ ఉంటే ఎవరికి వస్తోంది అని వేచి చూడాలి.