బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కమిట్‌మెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పెర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయింటెయిన్ చేయడంలో అతడు ఎప్పుడూ గీత దాటడు. నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ ఆరోగ్యపరంగా ఎంతో జాగ్రత్త తీసుకుంటాడు. అందుకే రోమన్ హీరోలా అతడి రూపం మైమరిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానుల్ని సంపాదించి పెట్టింది ఈ రూపమే. ఇండియన్ సూపర్‌మేన్ గా అతడికి పిల్లల్లోనూ ఎంతో ఇమేజ్ ఉంది.
ఇటీవలే వార్ చిత్రంలో హృతిక్ లుక్ కి వరల్డ్ స్టన్ అయిపోయింది. ఓవైపు 30ఏళ్ల యువకుడైన టైగర్ ష్రాఫ్ చొక్కా విప్పి అదిరిపోయే స్టంట్స్ చేస్తుంటే అతడితో పోటీపడుతూ 40 ఏళ్ల హృతిక్ చించి ఆరేశాడు. హాలీవుడ్ యాక్షన్ హీరోలకే చెమటలు పట్టే లుక్ తో అతడు యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. ఈ వయసులోనూ అతడు తన లుక్ విషయంలో ఏమాత్రం తగ్గలేదు.అయితే ఈ లుక్ కోసం హృతిక్ ఎంతగా శ్రమించాడో తాజాగా రిలీజ్ చేసిన ఓ వీడియోలో తనే స్వయంగా వెల్లడించాడు. ఓవైపు వెన్నుపూసలో కొన్ని డిస్కులు కదిలిపోతే .. వాటిపై భారం పడకుండా ఎంతో జాగ్రత్తగా అతడు జిమ్ చేశాడు. నిపుణుల సలహాలతో ఎంతో కఠోరమైన ఎక్సర్ సైజులు చేశాడు. ఇక ఈ వీడియో చూసిన అల్లు శిరీష్.. తనకు స్ఫూర్తి హృతిక్ అని తెలిపారు. అయితే హృతిక్ కేవలం శిరీష్ కి మాత్రమే కాదు.. మెగా హీరోలందరికీ స్ఫూర్తి అతడు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ అందరికీ స్ఫూర్తి. హృతిక్, టైగర్ నటించిన వార్ చిత్రం ఇటీవలే 200 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ బెస్ట్ హిట్ చిత్రంగా రికార్డులకెక్కింది.
https://www.youtube.com/watch?v=CZFnWmo8LNc