ఆ బ్రాండ్‌ను బాగానే ప్రమోట్ చేసుకుంటున్నారు.. అదే బాటలో అల్లు శిరీష్

Allu Sirish about Allu Studio

అల్లు ఫ్యామిలీ ఇప్పుడు తమకంటూ ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక ఎన్నాళ్లు మెగా హీరోలమని అనిపించుకుంటామనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. అందుకే అల్లు బ్రాండ్‌ను హడావిడిగా పైకి తీసుకొచ్చేసి.. దానికంటూ సపరేట్ ఇమేజ్‌ను అద్దాలని చూస్తున్నారు. అందుకే అల వైకుంఠపురములో ఈవెంట్‌లలో బన్నీ అల్లు భజన చేశాడు. తాత, తండ్రి అంటూ ఎప్పుడూ లేనంతాగా మాట్లాడాడు. అక్కడ కనీసం మెగా అనే పదాన్ని కూడా వాడలేదు.

Allu Sirish about Allu Studio
Allu Sirish about Allu Studio

అలా అల్లు బ్రాండ్‌ను ప్రతీ చోటా విస్తరింపజేయాలని చూశారు. ఓటీటీలోనూ తమ ఆధిపత్యమే కనిపించేలా చేశారు. ఇక అల్లు ఫ్యామిలీకి ఇప్పుడు ఓ స్టూడియో మాత్రమే తక్కువైంది. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలకు సపరేట్ స్టూడియోలున్నాయి. అలా అల్లు వారు కూడా తమకంటూ ప్రత్యేకంగా స్టూడియో ఉండాలని అనుకున్నారు. అందుకోసమే భారీ ఎత్తున అల్లు స్టూడియో నిర్మాణాన్ని ప్రారంభించాడు. అలా ప్రతీ చోటా అల్లు బ్రాండ్ కనిపించేలా ప్లాన్లు చేశారు.

అంతే కాకుండా ఇంతకు ముందు గీతా ఆర్ట్స్ కార్యాలయంపై ఎలాంటి సింబల్స్ ఉండేవి కావు. కానీ ఇప్పుడు మాత్రం అల్లు అనే పదాన్ని పెద్ద అక్షరాలతో పెట్టించారు. ఇక అల్లు శిరీష్ తాజాగా తన అల్లు బ్రాండ్ పవర్ ఏంటో చూపించేందుకు ఓ పోస్ట్ చేసినట్టున్నాడు. సంక్రాంతి తరువాత మొదటిసారిగా షూటింగ్ సెట్‌లో అడుగుపెడుతున్నానని చెప్పాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కూడా అల్లు శిరీష్ పోస్ట్ చేసిన ఫోటోలో అల్లు స్టూడియో అనే బోర్డును కనిపించేలా పోస్ట్ చేశాడు. అలా అల్లు శిరీష్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నాడు.