అమ్మ బాబోయ్.. అల్లు అరవింద్‌ క్రేజీ ఫోటోతో స్నేహా రెడ్డి రచ్చ

Allu Sneha reddy shares Allu Aravind Pic On His Birthday

వయసు అనే దేహానికి ఉంటుంది.. మనిషి ఆలోచనలకు కాదు. అసలు ఆలోచనలను బట్టి వయసును నిర్దారించాలి.. ఎందుకంటే యవ్వనంలో ఉన్నవారు కూడా బద్దకంగా ఉంటూ వినూత్న ఆలోచనలు చేయలేరు.. కానీ వయసు మీదపడుతున్నా కొద్దీ కొందరు మాత్రం యువకుల్లా ఆలోచిస్తుంటారు.. యూత్ చేసే పనులే చేస్తూ చలాకీగా ఉంటారు. అలాంటి కేటగిరిలో అల్లు అరవింద్ ముందుంటారు. ఇంకా ఏదో నేర్చుకోవాలి.. ఇంకా ఏవేవో కొత్తగా చేయాలని పరితపిస్తుంటాడు.

Allu Sneha reddy shares Allu Aravind Pic On His Birthday

మొత్తంగా అల్లు అరవింద్ మాత్రం అందరికీ కంటే యాక్టివ్‌గా థాట్ ఫుల్‌గా ఉంటాడు. నేడు (జనవరి 10) అల్లు అరవింద్ బర్త్ డే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్, సెలెబ్రిటీలు అల్లు అరవింద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బన్నీ, అల్లు శిరీష్ ట్వీట్లు చేశారు. తమదైన శైలిలో విషెస్ చెప్పారు. కానీ అందరి కంటే ఎక్కువగా ఫేమస్, క్రేజీగాఉంది మాత్రం అల్లు స్నేహారెడ్డి పోస్టే. తన మామగారికి వెరైటీగా విషెస్ చెప్పింది.

మొదటగా ఫ్యామిలీతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే మామయ్య అంటూ చెప్పుకొచ్చింది. ఆ ఫోటోలు అల్లు పిల్లలున్నారు. ఇక తరువాత ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో అల్లు అరవింద్ ఆర్ 15 లాంటి స్పోర్ట్ బైక్ ఎక్కి రైడింగ్‌కు రెడీగా ఉన్నాడు. మొత్తానికి యూత్‌లా మారిపోయిన అల్లు అరవింద్ పిక్ తెగ వైరల్ అవుతోంది. అంతే కాకుండా తన మామగారు కింగ్ అన్నట్టుగా ఓ కిరీటాన్ని కూడా పెట్టేసింది.