షాకింగ్ న్యూస్ : మెగా డైరెక్టర్ బాబీ ఇంట విషాదం..తన తండ్రి మృతి.!

Chiranjeevi

తెలుగు సినిమా దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోని మెప్పించడం అంత తేలిక విషయం కాదు. రీమేక్ సినిమాలు అంటే చిరు ఎవరొకరికి అవకాశం ఇవ్వొచ్చు కానీ ఒక కొత్త కథని చెప్పి చిరు ని మెప్పించాలి అంటే అది చాలా తక్కువ మంది వల్లే అవుతుంది.

ఇప్పుడు అలాగే మెగాస్టార్ ని మెప్పింది తన కెరీర్ లో 154వ సినిమా మాసివ్ లెవెల్లో తెరకెక్కిస్తున్న దర్శకుడు బాబీ. ఈ దర్శకుడు చేసినవి తక్కువ సినిమాలే అయినా కొత్త కథతో ఓ భారీ సినిమాని చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇదే దర్శకుడి ఇంట విషాదం నెలకొన్నట్టుగా సినీ వర్గాల్లో షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది.

ఈ దర్శకుడు తండ్రి కొల్లి మోహన్ రావు కొంతకాలం నుంచి హైదరాబాద్ లోనే తన కాలేయం సంబంధించి వ్యాధి తో బాధ పడుతుండగా ఫలితం లేకపోవడంతో దురదృష్టవశాత్తు తన 69వ ఏట కన్ను మూసినట్టుగా తెలిసింది. దీనితో సినీ వర్గాల వారు దర్శకుడు బాబీ కి ధైర్యం చెబుతున్నారు.