షాక్ :తలకు దెబ్బ తగలి స్టార్ హీరోయిన్ కు మెమరీ లాస్
సినిమాల్లో హీరోలకు తలకు దెబ్బ తగలటం, కోలుకోవటం వంటివి చూస్తూంటాం. ఆ పాయింట్ చుట్టూ ఎన్నో ప్రేమ కథలు తెరకెక్కాయి. అయితే అలాంటివి నిజ జీవితంలో జరుగుతాయంటే ప్రేక్షకులు నమ్మరు. అలాంటిది ఓ స్టార్ హీరోయిన్ కు అలాంటి పరిస్దితి వస్తే …మెమరీ లాస్ కు గురి అయితే పరిస్దితి ఏమిటి.
బాలీవుడ్‌లో అదిరిపోయే అందగత్తెల్లో దిశా పటానీ ఒకరు. అయితే ఆ అందం, గ్లామర్ ఇవేవీ దిశాను నెంబర్ వన్ హీరోయిన్‌ని చేయలేకపోయాయి. బాలీవుడ్‌లో అడపాతడపా సినిమాలు చేస్తున్నా, దక్షిణాదిన మాత్రం పాగా వేయలేకపోయింది. తెలుగులో ఆమమె వరుణ్ తేజ్ సరసన చేసిన లోఫర్ ఫ్లాప్ కావడంతో దిశా మరోసారి తెలుగులో నటించే సాహసం చేయలేదు. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు తను మెమరీలాస్ కు గురి అయ్యానని చెప్తోంది. తలకు దెబ్బతగలటంతో ఆమెకు జ్ఞాపకశక్తి కోల్పోయిందిట.
ఈ విషయం గురించి దిశా మాట్లాడుతూ… ఓ సారి ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు వ్యాయామం చేస్తున్నాను. అప్పుడు ఓ టెర్రర్ లోని కాంక్రీట్ ఫ్లోర్ పై చేస్తున్నప్పుడు అనుకోకుండా బాలెన్స్ తప్పి క్రింద పడటం జరిగిందిట. దాంతో తలకు దెబ్బ తగిలి మెమరీ లాస్ అయ్యింది. ఆరు నెలలు పాటు తాను చాలా కష్టపడి మేనేజ్ చేసానంటోంది. ఈ విషయం ఇన్నాళ్లకు చెప్పే ధైర్యం వచ్చిందంటోంది. నా జీవితంలో ఆరు నెలలు మిస్సయ్యాయి అని చెప్తోంది.
దిసా మాట్లాడుతూ…వర్కవుట్లు అనేవి అందంగా కనిపించడానికే కాదు, ఆరోగ్యంగా ఉండడానికి కూడా దోహదపడతాయి. నేను రోజూ వర్కవుట్స్ చేస్తుంటాను. ఉదయాన్నే కార్డియోతో నాకు రోజు మొదలవుతుంది. డ్యాన్సింగ్, కిక్ బాక్సింగ్, జిమ్నాస్టిక్స్ కూడా చేస్తుంటాను. సాయంత్రం వేళల్లో వెయిట్ ట్రైనింగ్ చేస్తుంటాను. ప్రొటీన్, కార్పోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటాను. మహిళలు కేవలం కార్డియో మాత్రమే చేయగలరన్నది చాలా మంది అభిప్రాయం. కానీ ఆడవాళ్లు బరువులు కూడా ఎత్తగలరు. మా జిమ్‌లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్స్ చేస్తుంటారు అని చెప్పుకొచ్చింది.