“లైగర్” కి ఉత్తరాంధ్ర లో భారీ బిజినెస్??

ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినిమా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా చిత్రం ఏదన్నా ఉంది అంటే అది రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరియు మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న చిత్రం “లైగర్” పేరు ఉండాల్సిందే.

మరి మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా రిలీజ్ కి మరికొన్ని రోజులు సమయం ఉండగా ఈ సినిమాకి థియేట్రికల్ గా భారీ మొత్తం ఫిగర్స్ తోనే జరుపుకుంటున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ గా ఈ చిత్రం ఉత్తరాంధ్ర థియేట్రికల్ హక్కులకు సంబంధించి టాక్ బయటకి వచ్చింది.

ఈ సినిమా హక్కులు కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ ఫిగర్ ని నమోదు చేసాడట. వినడానికి కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది కానీ తాను ఏకంగా 25 కోట్లు ఈ సినిమా హక్కులు కోసం పెట్టి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఉత్తరాంధ్రలో ఇంత మొత్తం షేర్ అంటే కష్టమే అని చెప్పాలి.

సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి కానీ లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుందో అనేది చెప్పడం కష్టం. మరి ఈ భారీ మొత్తాన్ని లైగర్ రాబడుతుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించగా ప్రస్తుతం చిత్ర యూనిట్ అంతా పాన్ ఇండియా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.