త్వరలో షకీలా బయోపిక్..హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ కూడా బ‌యోపిక్‌ల బాట ప‌ట్టింది. రీసెంట్‌గా రిలీజ్ అయిన హీరో సంజ‌య్‌ద‌త్ బ‌యోపిక్ ‘సంజు’ హిట్ టాక్ అందుకుంది. ‘ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్’ పేరుతో బోల్డ్ హీరోయిన్ స‌న్నీలియోన్ కథను వెబ్ సిరీస్ గా రూపొందించారు. ఇవాళ్టి నుండి అది టెలివిజన్ ఛానెల్లో ప్రసారం కానుంది. త్వరలో మరో సెన్సేషనల్ స్టార్ షకీలా బయోపిక్ కూడా రానుందని సమాచారం.

రీచా చద్దా

 

షకీలా జీవితాన్ని ఆధారంగా చేసుకుని డైరెక్టర్ ఇంద్రజిత్ లంకేష్ ఓ సినిమాను తెరకెక్కించనున్నాడట. దీనికోసం రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు నుండి ప్రారంభమవ్వనుంది. ఈ సినిమాలో షకీలాగా బాలీవుడ్ హీరోయిన్ రీచా చద్దా చేయనున్నారు. ఈ సినిమాలో షకీలా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుండి అడల్ట్ స్టార్ గా ఎలా ఎదిగారు అనే అంశాలను ప్రస్తావిస్తారట. అత్యంత సన్నిహితులు చేసిన మోసం వలనే తను ఆస్తి కోల్పోయానని షకీలా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం షకీలా ఒక అద్దె ఇంట్లో చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. మరి ఈ అంశాన్ని సినిమాలో చూపిస్తారో లేదో వేచి చూడాలి.