రాజకీయాల్లోకి షకీలా.. ఈ ట్విస్ట్ చాలా హాట్ గురూ.!

Shakeela

Shakeela

వెండితెరపై శృంగార తారలుగా వెలిగినంత మాత్రాన రాజకీయాల్లోకి రాకూడదన్న రూల్ ఏమీ లేదు. అయితే, షకీలా రాజకీయాల్లోకి రావడం మాత్రం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. షకీలా తెలుగు నేలకు చెందిన వ్యక్తి. కానీ, ఆమె మలయాళ సినిమాలతో పాపులర్ అయ్యింది. తెలుగు, తమిళ సినిమాల్లో కూడా నటించింది. సి-గ్రేడ్ శృంగార సినిమాల ద్వారా షకీలా మొత్తం ఇండియాలోనూ తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఇటీవల ఆమె జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కింది కూడా. కాగా, తమిళనాడు రాజకీయాల్లో షకీలా ఇకపై కీలక పాత్ర పోషించబోతోందట. ఆమె తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం.

తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మానవ హక్కుల విభాగంలో ఆమె బాధ్యతలు నిర్వహిస్తారట. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం గురించి అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. నిజానికి, తమిళనాడుతోపాటు కేరళలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

షకీలా గనుక కేరళ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించి వుంటే, అక్కడి రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుని వుండేవి. కాగా, ఎన్నికల ప్రచారం కోసం షకీలాను తమిళనాడుతోపాటు, కేరళలోనూ ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందట. షకీలా అంటే, కేవలం శృంగార సినిమాలే కాదు.. అంతకు మించి. మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు కూడా షకీలా సినిమాలకు భయపడేవారట. ఆ స్థాయిలో తక్కువ రోజుల్లోనే అత్యధిక లాభాలు షకీలా సినిమాలకు అప్పట్లో వచ్చేవి. పైగా, షకీలా సినిమాలుగా చెప్పబడే సినిమాల్లో ఆమె అతిథి పాత్రల్లాంటివే పోషించేది. కొన్ని శృంగార సన్నివేశాలు.. అవి కూడా రోజుల వ్యవధిలో షూటింగ్ జరిగిపోయేలా డిజైన్ చేసేవారు ఆమె కోసం.