బాలీవుడ్ హాట్‌భామ రిచా చడ్డా, తాజాగా దర్శకుల పై చేసిన వ్యాఖ్యలు అక్కడి సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. అసలు మ్యాటర్ ఏంటంటే., ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకోవాలంటే, దర్శకుల కోరిక తీర్చేందుకు, పడకగదికి వెళ్ళాల్సిందే అని, వారికి పడకసుఖం అందిస్తేనే చాన్సులు, లేకుంటే సినిమా నుండి తప్పిస్తారని రిచా చడ్డా సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇక అంతటితో ఆగని రిచా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటి జాలి ఉన్నవాళ్ళ వర్గం, రెండు జాలి లేని వాళ్ళ వర్గం.. రెండే వర్గాలు ఉన్నాయన్నారు. ఇండస్ట్రీలో కొందరు దర్శకులు హీరోయిన్లను చాలా చులకనగా చూస్తారని రిచా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక సూసైడ్ చేసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని తెలిపింది రిచా. ఇద్దరం థియేటర్ గ్రూప్ వర్కు షాపుకు పనిచేసేవాళ్ళమని, ఈ క్రమంలో తనని సుశాంత్ బండిమీద తీసుకెళ్ళేవాడని రిచా చెప్పింది. ఇక సుశాంత్ మరణించిన తర్వాత సంతాపం ప్రకటించిన చాలామంది దర్శకులు, వారి పడకగదికి వెళ్ళకపోతే, తమ సినిమాల నుండి తీసేసిన సందర్భాలు చాలా ఉన్నాయని రిచా ఆవేదన వ్యక్తం చేసింది.