వీడియో : ”శైలజారెడ్డి అల్లుడు” ట్రైలర్

నాగచైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ నాగార్జున బర్త్ డే కానుకగా విడుదల కావాల్సి ఉండగా నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో వాయిదా వేశారు.

ఈ ట్రైలర్ నేడు (శుక్రవారం) రిలీజ్ చేసింది చిత్రబృందం. ‘నా పేరు చైతన్య’.. అంటూ తన క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేసుకునే సీన్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. వెన్నల కిషోర్ చేసే కామెడీ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. పృధ్వీ కామెడీ , రమ్య కృష్ణ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్.టోటల్ గా ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ సినిమా ఫుల్ లెంగ్త్  కామెడీతో ప్రేక్షకులను అలరిస్తుందని అనిపిస్తోంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.