అందాల కథానాయికలు చాలా మంది 30 ప్లస్ బార్డర్ క్రాస్ చేసినా ఇంకా పెళ్లాడేందుకు ఎందుకనో విముఖత చూపుతుంటారు. కేవలం కథానాయికలే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం పెళ్లంటే దూరం దూరంగా ఉంటారు. చాలా మంది నట జీవితానికే అంకితమై పెళ్లి మాటే ఎత్తరు. అలాంటి బాపతులోనే ఓ సీనియర్ నటి ని ఎందుకని పెళ్లాడరు? అని ప్రశ్నిస్తే ఏవేవో చెబుతూ అసలు సంగతిని దాటవేయడం పరిశ్రమలో చర్చకు వచ్చింది.
అసలు తాను ఎప్పటికీ పెళ్లాడకూడదని నిర్ణయించుకున్నానని తన జీవితంలో ఎంతో ముఖ్యమైన నాన్నగారు చనిపోయాక ఈ నిర్ణయం తీసుకున్నానని సదరు నటీమణి తెలిపారు. అయితే ఇదొక్కటే అసలు కారణం కాదు. తాను యుక్తవయసులో ఉన్నప్పుడు ఓ హీరోతో లవ్ లో పడి అటుపై భంగపడి చివరికి పెళ్లిపై విరక్తి చెందడం వల్లనే అలా అయ్యిందన్న గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.
ఇంతకీ సదరు సీనియర్ నటి ఎవరు? అంటే.. చారెడేసి కళ్లతో ఎంతో అందంగా ఉంటుంది. నటనతోనూ మంత్రముగ్ధం చేస్తుంది. ప్రస్తుతం క్యారెక్టర్ నటిగానూ బిజీ. కొరటాల సినిమాల్లో తల్లి పాత్రలు పోషించింది. ఒకప్పుడు మూడు నాలుగు సినిమాల్లో కథానాయికగానూ యూత్ గుండెల్లో జిల్లనిపించింది.