ఇరువురి భామల కౌగిలిలో.!

ఓ యంగ్ హీరోయిన్‌తో డేటింగ్, ఓ సీనియర్ హీరోయిన్‌తో స్నేహం వెరసి ఇరువురి భామల కౌగిలిలో.. అంటూ ఓ యంగ్ హీరో గురించి సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయ్.

ఈ సెటైర్లు కాస్త శృతి మించడంతో, ఆ యంగ్ హీరో అలర్ట్ అవ్వాల్సి వచ్చిందట. ఇద్దరిలో ఎవరితోనూ తాను ప్రేమలో లేనని ఆ హీరో తన సమీకులతో చెబుతున్నాడట.

ప్రొఫిషనల్ రిలేషన్‌షిప్ తప్ప అలాంటిదేమీ లేదని ఆ హీరో చెబుతున్నా.. సదరు హీరోయిన్లతో ఎఫైర్ కారణంగా కెరీర్ చెడగొట్లుకుంటున్నాడంటూ ఆ యంగ్ హీరో గురించి సానుభూతి కామెంట్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయ్.

ఒకప్పుడు సెన్సేషనల్ హీరో ఆయన. కానీ ఇప్పుడు కాదు. గట్టిగా షాక్ తగలడంతో, కాస్త కుదేలయ్యాడు. దాంతో, కెరీర్‌‌ని గాడిన పెట్టుకునే పనిలో బిజీగా వున్నాడు.

అయినా కానీ, ఇలాంటి గాసిప్స్ ఒకింత ఆ యంగ్ హీరోని కుంగదీస్తున్నాయట. అయితే, నిప్పు లేనిదే పొగరాదు కదా.! ఒకవేళ మనోడు చెబుతోంది నిజమే అయితే, ఇలా నిప్పు రాజేసే వార్తల పట్ల కాస్త జాగ్రత్త పడాలి మరి.