ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. సీనియర్ స్టార్ హీరోలతో నటించింది. ఎన్నో సూపర్ హిట్లు అప్పట్లో ఆమె సొంతం. కానీ, ఇప్పుడు ఆమెకి వదిన, అక్క పాత్రలే ఆఫర్ చేస్తున్నారట పాపం.
ఆల్రెడీ ఆ తరహా పాత్రల్లో ఇప్పటికే నటించేసింది ఈ సీనియర్ నటి. సీనియర్ అంటే మరీ ఏమంత వయసైపోలేదండోయ్. ఓల్డ్ ఏజ్ కేటగిరిలో వేసేయలేం. చేయాలంటే, గ్లామర్ ఒలకబోయదగ్గ స్టామినా వుందామెకి. కానీ, ఛాన్సులు మాత్రం సీనియర్ నటి తరహాలోనే వస్తున్నాయట. తాజాగా ఇంకాస్త వయసుకు మించిన పాత్ర వస్తే, నాకేమంత వయసైపోయిందంటూ బెట్టు చేసిందట.
ఓ పక్క సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో ఊదరగొడుతోంది ఈ సీనియర్ నటి. సీనియర్ హీరోలు దూకుడు మీదున్న ఈ టైమ్‌లో మేకర్లు ఈ ముద్దుగుమ్మపై ఓ లుక్కేయరేం.. అంటూ నెటిజన్లు కూడా ఈ ముద్దుగుమ్మ సోషల్ హాట్ లుక్స‌్ చూసి తమ అభిప్రాయాల్ని సంకేతాల రూపంలో షేర్ చేస్తున్నారట.
దాంతో, ఈ సీనియర్ నటికి ఇంకాస్త బెట్టి పెరిగిందంటున్నారు. గ్లామర్‌గా కనిపించేందుకూ సిద్ధమే. ఇకపై వదిన, అక్క పాత్రలకు చెల్లు చీటీ అనేసేలా వుందని అంటున్నారు. ఇంతకీ ఎవరా సీనియర్ నటి.? ఏంటా కథ.? తెలియాల్సి వుంది.