అనసూయ అయితే వద్దులే.!

వరుస సినిమాలతో అనూహ్యంగా లైమ్ లైట్‌లోకి వచ్చిన అనసూయ ప్రస్తుతం కొంచెం జోరు తగ్గించిందట.

అందుకు కారణం వరుసగా అనసూయ చేస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తుండడమే. ఇన్ని సినిమా ఆఫర్లు ఎలా వచ్చేశాయా.? అనేంతగా బ్యాక్ టు బ్యాక్ సినిమా్ల్లో బిజీ అయిపోయింది అనసూయ.

బిజీ కావడంతో పాటూ, అనసూయ వుంటే, ఆ సినిమా హిట్టే అన్న క్రేజ్ కూడా దక్కించుకుంది మొదట్లో.
కానీ, ఇప్పుడు సీను మారిపోయింది. అనసూయ వుంటే ఆ సినిమా ఖచ్చితంగా ఫట్టే అనేట్టు మారింది పరిస్థితి.

ఆమె ఎంచుకునే పాత్రలు కూడా ఏమంత ఎఫెక్టివ్‌గా వుండడం లేదు. దాంతో, మేకర్లే అనసూయని లైట్ తీసుకుంటున్నారనీ ఇన్‌సైడ్‌లో గుసగుస వినిపిస్తోంది.

అయితే, అనసూయ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్ ‘పుష్ప 2’ వుంది ఇంకా. ఈ సినిమాతో తన దశ మళ్లీ తిరుగుతుందని నమ్మకం వ్యక్తం చేస్తోందట అనసూయ.

అయితే, ఓ సినిమా కోసం అనసూయతో గతంలో జరిగిన ప్రయత్నాలు ఇప్పుడు ఆగిపోయాయనేది తాజా గాసిప్.

అప్పట్లో అనసూయకున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ సెట్ చేశారట. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో సదరు నిర్మాణ సంస్థ మరో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

అనసూయ ప్లేస్‌ని మరో క్రేజీ సీనియర్ నటితో రీ ప్లేస్ చేయాలనుకుంటోందట. ఓ యంగ్ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడట. అనసూయది ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రనీ తెలుస్తోంది.

ఓ యంగ్ పెయిర్ లీడ్ రోల్ పోషించబోతున్నారట. మరి, జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో కానీ, అనసూయకు రీప్లేస్‌మెంట్ అంటే.! ఎవరొస్తారో చూడాలి మరి.