సైరా డిజిట‌ల్ రైట్స్ అస‌లు గుట్టు ఇదీ

`సైరా` డిజిట‌ల్ & శాటిలైట్ రైట్స్ ఎంత‌కు?

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా: న‌ర‌సింహారెడ్డి` తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డం, మ‌ల‌యాళంలో దాదాపు 10వేల స్క్రీన్ల లో రిలీజ్ చేసేందుకు కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ భారీ స‌న్నాహ‌కాలు చేస్తోంద‌ని స‌మాచారం. అక్టోబ‌ర్ 2న ఈ చిత్రాన్ని ఇరు తెలుగు రాష్ట్రాలు స‌హా ఉత్త‌రాదిన‌.. ఓవ‌ర్సీస్ లో భారీగా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.  

సైరా డిజిట‌ల్, శాటిలైట్ హ‌క్కుల‌కు సంబంధించి ర‌క‌ర‌కాల ప్ర‌చారం సాగింది. అయితే తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం.. సైరా సౌత్ శాటిలైట్ రైట్స్ ని జెమిని (స‌న్‌) నెట్ వ‌ర్క్ 25 కోట్లకు ద‌క్కించుకుంద‌ని తెలుస్తోంది. సైరా డిజిట‌ల్ రైట్స్ ని అమెజాన్ కి 50కోట్ల‌కు విక్ర‌యించార‌ని వెల్ల‌డైంది. టీజ‌ర్, మేకింగ్ వీడియోతో హైప్ పెంచిన కొణిదెల టీమ్ ఇటీవ‌లే ట్రైల‌ర్ రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. భారీ హిస్టారిక‌ల్ వారియ‌ర్ క‌థాంశానికి త‌గ్గ‌ట్టే హాలీవుడ్ రేంజు విజువ‌ల్స్ తో ట్రైల‌ర్ క‌ట్టి ప‌డేసింది. దీంతో ఈ సినిమాకి అటు హిందీ మార్కెట్ స‌హా ఇత‌ర‌త్రా చాలా చోట్ల హైప్ పెరిగింద‌ని చెబుతున్నారు. దాదాపు 270 కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ నిర్మించింది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.