మున్నాభాయ్‌కి స్టేజ్‌4 ఊపిరితిత్తుల క్యాన్సర్‌.. టెన్ష‌న్‌లో ఫ్యాన్స్‌

మున్నాభాయ్ సంజ‌య్ ద‌త్ (61)కి స్టేజ్ 4 క్యాన్స‌ర్ ని ధృవీక‌రిస్తూ ముంబై లీలావ‌తి ఆస్ప‌త్రి వ‌ర్గాలు చేసిన ప్ర‌క‌ట‌న అభిమానుల్లో ఆందోళ‌న‌కు కార‌ణ‌మైంది. ఊపిరితిత్తుల్లో శ్వాస సంబంధ స‌మ‌స్య‌ల‌తో ఆస్ప‌త్రిలో చేరిన ఆయ‌న‌కు కోవిడ్ ప‌రీక్ష‌ల్ని నిర్వ‌హించ‌గా ప్ర‌తికూల ఫ‌లితం వ‌చ్చింది. అయితే ఊపిరితిత్తుల్లో ద్ర‌వాలు చేరాయ‌ని వైద్యులు నిర్ధారించారు.

అనంత‌ర ప‌రీక్ష‌ల్లో అత‌డికి స్టేజ్ 4 క్యాన్స‌ర్ బ‌య‌ట‌ప‌డింది. క‌రోనా సోకిందా లేదో నిర్ధారించే ఆక్సిజ‌న్ టెస్టుల్లో ఆక్సిజ‌న్ స్థాయి 90-92% మధ్య హెచ్చుతగ్గులకు గురైంది. దీనివ‌ల్ల‌నే క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ప్ర‌మాద‌క‌ర క్యాన్స‌ర్ అని బ‌య‌ట‌ప‌డింది. శ‌నివారం నాడు ఆసుపత్రిలో చేర్పించ‌గా.. కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించ‌గానే సోమవారం నాడు డిశ్చార్జ్ చేశారు.

త‌న‌కు వైద్య చికిత్స జ‌రుగుతోంద‌ని కొంత‌కాలం పాటు సినిమాల‌కు విరామం తీసుకుంటున్నాన‌ని ద‌త్ ప్ర‌క‌టించారు. అభిమానుల్ని ఆందోళ‌న చెంద‌వద్ద‌ని స‌ముదాయించారు. కేజీఎఫ్ – చాప్ట‌ర్ 2లో సంజ‌య్ ద‌త్ విల‌న్ అధీరగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈపాటికే రిలీజ్ కావాల్సిన‌ది కోవిడ్ లాక్ డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డింది. 2020 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేస్తార‌ని స‌మాచారం.