రానా దగ్గుబాటి – మిహీకా బజాజ్ జంట నిశ్చితార్థం పూర్తయిందా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన క్లూ ఇంకా బయటపడకపోయినా ఫ్యామిలీ ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయని తాజా లీకులు చెబుతున్నాయి. ఈసారి క్లూ ఇచ్చింది ఎవరో కాదు.. అక్కినేని కోడలు సమంత.
“2020 ఉత్తమ శుభవార్త“ అంటూ సామ్ ఓ ఫోటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ ఫోటోలో రానా – మిహీక జంట సహా నాగచైతన్య- సమంత జంట.. అభిరామ్ దగ్గుబాటి.. అలాగే మిహీక తరపు బంధువులు కనిపిస్తున్నారు. ఫ్యామిలీ కార్యక్రమంలో పాల్గొన్న సమంత ఆ సంతోషాన్ని దాచుకోలేక ఇలా ఫోటోని షేర్ చేశారు.
ఈ ఫోటోలో కెమెరాకి పోజులివ్వడమే గాక ఫుల్ చిలౌట్ మూడ్ లో ఉన్నారంతా. ఫోటోను పోస్ట్ చేసిన సమంత రానా – మిహీకా జంటకు శుభాకాంక్షలు తెలిపింది. 2020 ఉత్తమ వార్తలను మా ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు. రానా దగ్గుబాటి – మిహీక బజాజ్ … మీ సంతోషం ఎప్పటికీ ఇలానే ఉండాలి“ అంటూ బ్లెస్ చేసింది సామ్.