సమంత, సిద్ధార్థ.. గత కొన్నేళ్ల క్రితం చెట్టాపట్టాలేసుకుని తిరగిన విషయం అందిరికి తెలిసిందే. పెళ్లి చేసుకుంటారని కోలీవుడ్, టాలీవుడ్‌లలో ప్రచారం కూడా జరిగింది. ఇద్దరు తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి సంబంధించిన పూజ కూడా చేశారు. ఆ తరువాత నుంచే ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఏం జరిగిందో ఏమో ఎవరికీ తెలియదు…ముంబైలో జరిగిన ఓ పార్టీలో ఏం జరిగింది?., సమంతకు ఉన్నట్టుండి ముఖానికి సర్జరీ ఎందుకు జరిగింది అన్నదాంట్లో ఎలాంటి క్లారిటీ లేదు.
కానీ మొత్తానికి ఇద్దరి మధ్య ఏదో జరిగింది. అయితే అది మాత్రం బయట పెట్టడానికి ఎవరికీ ఇష్టం లేదు. ఇటు సామ్ కానీ, సిద్ధర్ధ్ కానీ జరిగిన సంఘటన గురించి బయటికి చెప్పలేదు. ఇద్దరిలో ఎవరిపై ఎవరు కోపాన్ని ప్రదర్శించారు. ముంబై పార్టలో సామ్‌కు ఏం జరిగింది? ఎందుకు ఇద్దరు విడిపోయారు? అన్నది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇదిలా వుంటే తాజాగా ఓ మీడియా ఇంటరాక్షన్‌లో సామ్ పెళ్లైన ఇన్నాళ్లకు సిద్ధర్ధ్‌తో కలిసి వుంటే తన పరిస్థితి కూడా సావిత్రిలాగే అయ్యేదని చెప్పడం విడ్డూరమే అంటున్నారు. ఇన్నాళ్లు ఈ విషయాన్ని సామ్ ఎందుకు దాచింది? ఇప్పుడే ఎందుకు బయటపెడుతోంది?
అన్నది మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. సామ్‌కు సిద్ధార్ధ్ విషయం ఇన్నాళ్లకు ఎందుకు గుర్తొచ్చింది? ఇప్పుడే ఎందుకు సిద్దూను టార్గెట్ చేస్తోంది? అని ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మరి సామ్ విమర్శలపై సిద్దూ ఏమైనా స్పందిస్తాడో చూడాలి.