సడెన్ గా సాయి పల్లవి పేరు ఎందుకు హాట్ టాపిక్ గా మారింది అంటే..?

ఎలాంటి ఎక్స్ పోజింగ్ కూడా లేకుండా హీరోయిన్ గా రాణించాలి అంటే అది అందరి తోను సాధ్యం కాని పని కానీ కేవలం నటనతో మాత్రమే సత్తా చాటి నిలదొక్కుకోవడం అనేది తక్కువ మంది తోనే అవుతుంది. అలంటి తక్కువ మంది హీరోయిన్స్ లో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కూడా ఒకామె.

తన నాచురల్ నటనతో ఆకట్టుకునే సాయి పల్లవి పేరు ఈ రెండు రోజులు నుంచి సడెన్ గా హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో మారి వినిపిస్తుంది. అయితే రీసెంట్ గా ఆమె నటించిన హార్డ్ హిట్టింగ్ సినిమా “గార్గి” రిలీజ్ అయ్యి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ అందుకుంది.

అయితే ఏఈ సినిమా లేటెస్ట్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చింది ఇది ఒక కారణం కాగా ఈ చిత్రం మాస్కో లోని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపిక కావడంతో ఆమె పేరు హాట్ టాపిక్ గా మారింది. ఇంతే కాకుండా ఈ సినిమా ఇప్పుడు చూస్తున్న వారు ఆమె నటన కోసం కూడా ప్రత్యేకించి చెప్తుండడంతో కూడా ఆమె పేరు ట్రెండ్ అవుతూ ఉండగా..

లేటెస్ట్ గా కొన్ని వీడియో విజువల్స్ ఆమె ఫ్యామిలీ తో బయటకి వెళ్ళినవి బయటకి వచ్చాయి. దీనితో ఇన్ని కారణాల చేత సోషల్ మీడియాలో సాయి పల్లవి పేరు హాట్ టాపిక్ గా మారింది.