‘చిత్రలహరి’టీజర్ వచ్చేసింది, ఎలా ఉందంటే

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చెప్పినట్లుగానే చెప్పిన టైమ్ కు టీజర్ తో వచ్చేసాడు. తాను చేస్తున్న కొత్త సినిమా ‘చిత్రలహరి’ లోని పాత్రలను పరిచయం చేస్తానని ట్వీట్ చేసిన సాయిధరమ్ తేజ్ ఈ రోజు ఉదయం టీజర్ ద్వారా చిత్రంలోని పాత్రలను ప్రేక్షకుల ముందుంచాడు.

Chitralahari Movie Teaser | Sai Dharam Tej | Kalyani Priyadarshan | Nivetha Pethuraj | Sunil | DSP

‘‘చిత్రలహరి.. అప్పట్లో ఎవ్రీ ఫ్రైడే దూరదర్శన్‌లో వచ్చే ఓ ప్రోగ్రామ్.. ఈ చిత్రలహరి 2019లో ఓ ఫ్రైడే రిలీజ్ కాబోయే సినిమా.. అందులో కొన్ని పాటలు.. ఇందులో కొన్ని పాత్రలు’’ అంటూ ఈ సినిమాలోని పాత్రలన్నింటిని పరిచయం చేయటం ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉంది. ముఖ్యంగా ‘నా పేరు విజయ్.. నా పేరులో ఉన్న విజయం నా జీవితంలో ఎప్పుడొస్తుందో..’ అనే డైలాగ్ తో సాయి ధరమ్ తేజ స్పెషల్ గా కనిపించారు. చాలా వైవిద్యంతో కట్ చేసిన ఈ టీజర్ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. మెగాభిమానలుకు హిట్ సినిమా రాబోతోందన్న ఆనందం కలగచేస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘చిత్రలహరి’. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.