‘బ్రో’ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో కాదు.! సాయి ధరమ్ తేజ్ హీరో.! పవన్ కళ్యాణ్‌ది జస్ట్ సపోర్టింగ్ రోల్ అంతే.! ‘విరూపాక్ష’ సూపర్ హిట్ అయ్యింది.. అంతకు ముందు కోల్పోయిన స్టార్‌డమ్‌ని సాయి ధరమ్ తేజ్‌కి తిరిగి తీసుకొచ్చింది.
కానీ, ‘బ్రో’ పుణ్యమా అని, ‘ఇలాగైతే కష్టమే సుమీ’ అన్న విమర్శని సాయిధరమ్ తేజ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. యాక్సిడెంట్ నుంచి పూర్తిగా సాయి ధరమ్ తేజ్ కోలుకోలేదు. అదే అసలు సమస్య. కానీ, ‘బ్రో’ సినిమా చేసేశాడు.
తదుపరి సినిమాలకు అలా కుదరకపోవచ్చు. సాయి ధరమ్ తేజ్ అంటే డాన్సులేయాలి.. యాక్షన్ ఎపిసోడ్స్‌లో రిస్కీ స్టంట్స్ ప్రదర్శించాలి. ఇవన్నీ చేయాలంటే.. యాక్సిడెంట్ గాయాల నుంచి పూర్తిగా కోలుకోవాలి.
త్వరలో విదేశాలకు వెళ్ళి సర్జరీలు చేయించుకోనున్నాడట సాయి ధరమ్ తేజ్. దానికి ఆర్నెళ్ళ సమయం పడుతుందని అంటున్నాడు. కానీ, ఏడాదికి పైనే సమయం పడుతుందట. ఈలోగా ఈక్వేషన్స్ చాలానే మారిపోతాయ్.
అయినాగానీ, తప్పదు కదా.! ఈ లోగా, ఏదన్నా ఓ చిన్న సినిమా చేసేద్దామా.? అన్న తొందరలో సాయి ధరమ్ తేజ్ వున్నాడని తెలుస్తోంది. తేజ్‌తో గతంలో ఓ హిట్ సినిమా తీసిన దర్శకుడు ఓ కథ ఈ మధ్యనే వినిపించాడని సమాచారమ్.