‘రంగస్దలం’ గడ్డం లుక్ ని యాజటీజ్ దింపేసాడే

రామ్ చరణ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ‘రంగస్దలం’ . ఈ చిత్రం చెర్రీ గత రికార్డ్ లు అన్నిటినీ బ్రద్దలు కొట్టింది. అదే సాయ్ ధరమ్ తేజని
ఎట్రాక్ట్ చేసిందేమో ఆ సినిమాలో రామ్ చరణ్ గెడ్డంతో ఉండే లుక్ తో తన కొత్త చిత్రం ప్రారంభోత్సవం చేసాడు. దాంతో ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో ‘రంగస్దలం’ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడనే టాక్ పుట్టించింది.

దాదాపుగా ఆరు నెలలు నుంచి కెమెరాకి దూరంగా ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌ తాజాగా తన కొత్త సినిమాని లాంఛనంగా లాంచ్ చేసాడు. సెకండ్ హ్యాండ్, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాల డైరెక్ట్‌ చేసిన కిశోర్‌ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు.. చిత్రలహరి అనే  టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం   రొమాంటిక్‌ ఎంటర్టైనర్ గా సాగనుందని తెలుస్తోంది.. కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌.  మైత్రి మూవీమేకర్స్‌ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. నవంబర్‌లో షూటింగ్ మొదలుకాబోతోంది.

ఈ సందర్భంగా సినిమా గురించి హీరోయిన్  కల్యాణి ట్వీట్‌ చేస్తూ..‘నా మూడో ప్రాజెక్ట్‌ ‘చిత్రలహరి’ సినిమాలో నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్ఛేసి మమ్మల్ని ఆనందపరిచినందుకు ధన్యవాదాలు కొరటాల శివ సర్‌’ అని పేర్కొన్నారు.