అభిమానులంతా ఎదురుచూస్తున్న యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ‘సాహో’లోని ఫస్ట్ సాంగ్ టీజర్ వచ్చేసింది. ‘సైకో సయ్యాన్.. ’ అంటూ సాగే ఈ పాటలో ప్రభాస్ చాలా అందంగాగా కనిపించారు. శ్రద్ధ తన డ్యాన్సులతో, అందంతో ఆకట్టుకుంది. పాట చివర్లో శ్రద్ధ.. ప్రభాస్‌ను చూస్తూ.. ‘ఆగడిక సయ్యా సైకో’ అనడం ఫ్యాన్స్ కు తెగ నచ్చేస్తోంది. పూర్తి పాట వీడియోను త్వరలో జులైన 8న విడుదల చేయనున్నారు.
‘సాహో’ విడుదల సమయం దగ్గర పడుతుండటంతో -ఇండస్ట్రీ దృష్టి అంతా ఈ సినిమాపైనే ఉంది. బాహుబలి రెండు భాగాలకి ఎక్కువ సమయం తీసుకున్న ప్రభాస్ -కొంత గ్యాప్ తరువాత అదే స్దాయి భారీస్థాయి ప్రాజెక్టుతో ముందుకొస్తుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ఇంటిర్ నెట్ లో ‘సాహో’ అప్‌డేట్స్ హల్ చల్ చేస్తున్నాయి. మరో ప్రక్క ప్రభాస్, అతనితో జోడీకట్టిన శ్రద్ధాకఫూర్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి.
మూడు భాషల్లో భారీ బడ్జెట్ చిత్రంగా యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జిబ్రాన్ అందిస్తోన్న బ్యాగ్రౌండ్ స్కోర్ కొత్త అనుభూతినిస్తుందని, ప్రతి సన్నివేశాన్నీ ఎలివేట్ చేసే విధంగా బీజీని జిబ్రాన్ డిజైన్ చేశాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ఆగస్టు 15న థియేటర్లకు వచ్చేందుకు సాహో సిద్ధమవుతున్నాడు.