ఇలా అయితే వాట్టూడూ డార్లింగ్?
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన `సాహో` ప్రపంచవ్యాప్తంగా ఈనెల 30న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం లో అత్యంత భారీగా రిలీజవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 10వేల స్క్రీన్లు పైగానే యువి ప్రతినిధులు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే రిలీజైన ట్రైలర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. ఇప్పటికీ యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కి చక్కని ఆదరణ దక్కుతోంది.
సాహో రిలీజ్‌కి సరిగ్గా ఇంకో 9 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఇతరత్రా ప్రచారం ముగించి.. సెన్సార్ ఫార్మాల్టీస్ పైనా యు.వి.క్రియేషన్స్ బృందం దృష్టి సారించింది. అయితే సెన్సార్ ని ఇంత అడ్వాన్సుడ్‌గా ప్లాన్ చేసినా కానీ కొన్ని చిక్కులు తప్పడం లేదట. సెన్సార్ పూర్తయింది. సీబీఎఫ్‌సీ బృందం ఈ చిత్రానికి `ఏ` సర్టిఫికెట్ ఇచ్చింది. భారీ వయొలెన్స్ ఉంది కాబట్టి యుఏ ఇవ్వలేమని తేల్చి చెప్పేశారట. దీంతో టీమ్ చిక్కుల్లో పడ్డారని తెలుస్తోంది. సాహో చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియెన్ చూస్తేనే భారీగా వసూళ్లు తేగలుగుతుంది. అందుకే యుఏ సర్టిఫికెట్ కోసం నిర్మాతలు ప్రయత్నాల్లో ఉన్నారట. అయితే కొన్ని సన్నివేశాలకు కోత పెట్టేందుకు ఓకే చెబితేనే యుఏ రస్టిఫికెట్ ఇవ్వడం కుదురుతుందని సెన్సార్ బృందం శరతు విధించారట. అయితే ఆ కటింగ్‌కి సుజీత్, యువి బృందం ససేమిరా అంటున్నారట. ఈ సమస్యను ఎలా పరిష్కరించనున్నారు? అన్నది వేచి చూడాల్సిందే. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి తొలి వారం టిక్కెట్టు ధరలు పెంచుకుని విక్రయించనున్నారని తెలుస్తోంది.