అర్జున్ రెడ్డి, Rx 100 ఎఫెక్ట్ తోనే ఈ సాఫ్ట్ ఫోర్న్ చిత్రం ?

ఈ మధ్యకాలంలో వచ్చి యూత్ లోకి దూసుకుపోయిన సినిమాలు ఏమిటి అంటే కళ్లు మూసుకు చెప్పే తెలుగు సినిమాలు అర్జున్ రెడ్డి, Rx 100. ఈ రెండు సినిమాలు తెలుగు అమ్మాయిలు,అబ్బాయిలుకు తెగ నచ్చేసాయి. ఒకటి నాలుగు సార్లు తెగ ఎంజాయ్ చేసేసాయి. తమ జీవితాలనే తెరపై చూసుకున్నట్లుగా ఫీల్ అయ్యాయి. అయితే అందులో కంటెంట్ కొందరి అబ్జెక్షన్ గా కనిపిస్తే మరికొందరికి లిప్ టు లిప్ ముద్దలు వంటివి యూత్ ని పాడు చేస్తారంటూ సోషల్ మీడియాలో పెద్దవాళ్లు ఫైర్ అయ్యారు.

కుర్రాళ్లు లైట్ ఈ మాత్రం లేకపోతే సినిమా ఏంటి అనేసి హిట్ చేసేసారు. అంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల ప్రభావం జనాల మీద ఉందో లేదో కానీ సినిమావాళ్లపై పడింది. కుర్రాళ్లు కాస్తంత థియోటర్ కు రావాలంటే ఈ మాత్రం మసాలా ఉండాల్సిందే అని భావించటం మొదలెట్టి స్క్రిప్టులు రెడీ చేయిస్తున్నారు. కొందరు స్క్రిప్టు దశలోనే ఉంటే మరికొందురు షూటింగ్ కూడా పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేసేసారు. అలాంటి ఒక సినిమానే‘ఏడు చేపల కథ’.

“ఏడు చేపల కథ” చిత్రంలో టెమ్ట్ రవి అనే పాత్ర పూర్తి సెక్స్ ఓరియెంటేషన్ తో సాగుతుంది. అడల్డ్ కామెడీ జోనర్‌లో పూర్తిగా కొత్త వారితో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను,టీజర్ ని రీసెంట్ గా చిత్ర యూనిట్ విడుదల చేశారు. టీజర్ రిలీజ్ చేసాక జనాలకు ఈ సినిమలో ఉన్న విషయం ఏమిటో అర్దమైంది.

ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. మూడు మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి,పెద్ద సినిమాలకే షాక్ ఇచ్చింది. ఈ ఏడు చేపల్లో ఎంత విషయం ఉందో అర్దం చేసుకోవచ్చు అంటున్నారు సినీ జనం. ఇక ఈ ‘ఏడు చేపలు కథ’లో మెయిన్ క్యారక్టర్ టెమ్ట్ రవికి ఓ వీకెనెస్ ఉంటుంది. ఎవరైనా తన ముందు ఎక్సపోజ్ చేస్తే తట్టుకోలేడు. ఆ అమ్మాయితో శృంగార క్రీడలో పాల్గొనాల్సిందే. ఆ క్రమంలో అతనికి తగిలిన ఏడుగురు అమ్మాయిల కథే ఇది అని చెప్తున్నాడు. టీజరే ఈ రేంజిలో ఉంది ఇక సినిమాలో ఎంత శృంగారరసం ఒలకపోసారో అని జనం ఎదురుచూసేలా చేసాడు. ఈ చిత్రం బిజినెస్ కూడా ఓ రేంజిలో స్పీడుగా అయ్యిపోయిందిట.

అభిషేక్ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భానుశ్రీ, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జివిఎన్ నిర్మిస్తున్నారు.