మా సినిమా చూసి ఆత్మహత్య చేసుకోలేదు బాబోయ్

సినిమాల నుంచి మంచి తీసుకుంటారో లేదో కానీ చెడుకు మాత్రం జనం ఎట్రాక్ట్ అవుతారు. కొన్ని సార్లు ఆ చెడు మార్గంలో ముందుకు వెళ్తారని చాలా సార్లు ప్రూవైంది. తాజాగా మరో సంఘటన నిరూపించింది.   జగిత్యాలలో ఆదివారం రాత్రి ఇద్దరు స్టూడెంట్స్  పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తమ ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు, పాఠశాలలో ఎక్కడ తెలుస్తుందో అన్న భయంతో మహేందర్‌, రవితేజ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 

అయితే ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాలో అమ్మాయితో ప్రేమలో పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తానూ చనిపోతానని మహేందర్‌ తన మిత్రులతో చెప్పేవాడని పోలీసులు వెల్లడించడం రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం ఆ చిత్రం యూనిట్ ని కలవరపరిచింది. దాంతో  మేం
ఆర్టిస్టులం.. తీవ్రవాదులం కాదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హీరో కార్తికేయ.  అయితే ఇలా తమ సినిమా గురించి తప్పుగా ప్రచారం చేయడం సరికాదని కార్తికేయ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ వీడియో విడుదల చేసారు. ఆ వీడియోలో…


‘మేం ఆర్టిస్టులం.. ఉగ్రవాదులం కాదు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూసుకుందాం.. చెడుకు ప్రభావితం కాకుండా పిల్లల నడవడికను గమనిద్దాం’ అన్నారు. అందురు..‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాను విలన్‌లా చూపిస్తున్నారని అన్నారు. ఈ చిత్రంలో హీరో
ఆత్మహత్య చేసుకోడని, హీరోయిన్‌ హత్య చేయిస్తుందని తెలిపారు.

ఇలాంటి బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు తమని నెగిటివ్‌గా చూడటం మానేసి..పిల్లల్ని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నించాలని ఆయన సూచనలు చేసారు.