RX 100 గురించి సంచలనాత్మక డైరెక్టర్ వర్మ ట్వీట్

రాంగోపాల్ వర్మ ఏది మాట్లాడినా అర్ధమయ్యి కానట్టు ఉంటోంది. అతని అభిమానులకి తెలివైనవాడిగా అనిపిస్తే కొందరికి మాత్రం మూర్ఖుడిలా కనిపిస్తాడు వర్మ. రాము కొత్త సినిమా తీసినా, ఒక పోస్టు పెట్టినా అది మీడియాలో వాలిపోవాల్సిందే. ఇంతింతై వటుడింతై అన్నట్టు నెట్టింట్లో అదొక పెద్ద సెన్సేషన్ అయిపోతుంది. రాంగోపాల్ వర్మ సంచలనాల్లో శివ సినిమా, రక్తచరిత్ర తర్వాత బాగా పాపులర్ అయినవి మెగా ఫ్యామిలీపై ఆయన గుప్పించే విమర్శలు. సర్లెండి ఈ సోదంతా వదిలేసి అసలు సంగతిలోకి వెళ్తే RX 100 సినిమా మొదటి రోజున భారీ ఓపెనింగ్స్ రాబట్టిందని టాక్. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ ఒక ట్వీట్ పెట్టారు.

ప్రేక్షకులను థియేటర్లవైపు పరుగులు పెట్టిస్తున్నందుకు డైరెక్టర్ అజయ్ భూపతికి, హీరోయిన్ పాయల్, హీరో కార్తికేయకు రోరింగ్ కంగ్రాట్స్. సూపర్ ఓపెనింగ్స్, సూపర్ టాక్ అని ట్వీటాడు రామ్. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి రాంగోపాల్ వర్మ శిష్యుడే… అందుకే పాజిటివ్ గా ట్వీట్ పెట్టాడేమో అని డౌట్ కూడా కొంతమందికి ఉందనుకోండి. ఏదేమైనా సినిమా గురించి పాజిటివ్ టాక్ నడుస్తోంది. క్రిటిక్స్ కూడా టేకింగ్ భిన్నంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.

https://platform.twitter.com/widgets.js