యంగ్ హీరో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన చిత్రం ఆర్ఎక్స్ 100. ఈ సినిమా అజయ్ భూపతి దర్శకత్వంలో 2018 లో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా నిర్మాతకి కాసుల వర్షం కురిపించడమే కాకుండా డైరెక్టర్ కి హీరో హీరోయిన్ల కి కూడా మంచి క్రేజ్ తీసుకువచ్చింది. ఈ సినిమాతో కార్తికేయ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అయితే ఈ సినిమాకి హీరోగా కార్తికేయ కన్నా ముందు మరొక ఇద్దరు హీరోలని ఎప్రోచ్ అయ్యారు అంట డైరెక్టర్ అజయ్ భూపతి.
అసలు సినిమా కదా ఎలా మొదలైందో, ఈ హిట్ మూవీని మిస్ చేసుకున్న హీరోలెవరో ఒకసారి చూద్దాం. ఈ సినిమాకి డైరెక్టర్ అజయ్ భూపతి ప్రఖ్యాత డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవారు. రాంగోపాల్ వర్మ ఎటాక్ సినిమా తీస్తున్న సమయంలోనే అయిన వద్ద పనిచేసే అజయ్ భూపతి ఒక అమ్మాయి లవ్ లో పడటం, ఆమె అజయ్ ని మోసం చేయడం, దాని వలన అజయ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఎటాక్ సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టకపోవడం జరిగాయంట.
క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నావు కదా ఈ బాధనే కథగా మార్చుకొని కమర్షియల్ గా ఉపయోగించుకోమని ఎవరో సలహా ఇవ్వటంతో తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీని సినిమా కథగా రాసుకొని మొట్టమొదట ఆ కథని తీసుకొని విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళాడంట అజయ్ భూపతి. ఆ తర్వాత హీరో నవీన్ చంద్ర కి కూడా తన కథని వినిపించాడట. అయితే పలు కారణాల వలన ఆ వారిద్దరితోని ఈ సినిమా తీయటం జరగలేదు.
అప్పుడు కొత్త వారితో సినిమా తీయాలని నిర్ణయించుకున్న డైరెక్టర్ కార్తికేయని హీరోగా పెట్టి సినిమా తీసి సక్సెస్ సాధించాడు. అలాగే హీరోయిన్ ని కూడా ముందు పాయల్ రాజ్ పుత్ కాకుండా నందితా శ్వేతా ని హీరోగా పెట్టాలనుకున్నారంట కానీ ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్టం లేని నందిత ఈ సినిమాని వద్దనుకుందని సమాచారం.