RRR జీరో అప్‌డేట్‌.. మ‌ళ్లీ నిరుత్సాహమేనా జ‌క్క‌న్న‌

ప్ర‌స్తుతం `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రీక‌ర‌ణ‌తో రాజమౌళి త‌ల‌మున‌క‌లుగా ఉన్న‌ విష‌యం తెలిసిందే. అయితే ఎందుక‌నో ఇటీవ‌ల ఈ సినిమాపై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు షికారు చేస్తున్నాయి. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్న ఈ చిత్రం విష‌యంలో అభిమానుల సందేహాలు క్లియ‌ర్ చేయ‌కుండా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి నిరుత్సాహానికి గురిచేస్తున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌పైకి వ‌స్తున్న ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ ని ఖ‌రారు చేస్తారా? అని రాజ‌మౌళి, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ అభిమానులు ఆశ‌గా ఎదురుచూశారు. అయితే వారిని నిరుత్సాహ‌ప‌రుస్తూ జ‌క్క‌న్న ఏదీ చెప్ప‌డం లేదు. ఇప్ప‌టికి `రామ రౌద్ర రుషితం` అనే టైటిల్ ని ట్విట్ట‌ర్‌లో త‌న పీఆర్ టీమ్ ద్వారా ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్యానికి గురిచేశాడు.

ఆ త‌రవాత అయినా భారీ స‌ర్‌ప్రైజ్‌లు వుంటాయ‌ని అంతా భావించారు. ఈ గురువారం (10 అక్టోబ‌ర్) ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి పుట్టిన రోజు. దీంతో ఏదైనా స్పెష‌ల్ లుక్‌ని విడుద‌ల చేస్తార‌ని, లేదా ఇద్ద‌రు హీరోల‌కు సంబంధించిన లుక్ ఏదైనా విడుద‌ల చేసే అవ‌కాశం వుంద‌ని అంతా భావించారు. కానీ అదీ జ‌ర‌క్క‌పోవ‌డంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ‌ప‌డ్డారు. క‌నీసం మేకింగ్ వీడియో అయినా విడుద‌ల చేస్తార‌ని భావించారు. కానీ అదీ లేదు. ఈ సినిమా విష‌యంలోనే జ‌క్క‌న్న ఎందుకిలా చేస్తున్నాడ‌న్న‌ది ఏ ఒక్క‌రికీ అర్థం కావ‌డం లేదు.

ఇదిలా వుంటే ఈ చిత్ర రిలీజ్ డేట్ ని ప్రారంభానికి ముందే ప్ర‌క‌టించిన రాజ‌మౌళి ఆ డేట్ విష‌యంలో కొంత టెన్ష‌న్ ప‌డుతున్నాడ‌ట‌. స‌హ‌జంగా ఒక సినిమాని తెరపైకి తీసుకురావ‌డం కోసం ఎక్కువ రోజులు తీసుకునే జ‌క్క‌న్న `ఆర్.ఆర్.ఆర్‌` విష‌యంలో మాత్రం ముందే టార్గెట్ సెట్ చేసుకోవ‌డంతో అనుకున్న స‌మ‌యానికి సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయ‌గ‌ల‌మా ? అన్న‌ది రాజ‌మౌళి డౌట్‌. అదే ఇప్పుడు జ‌క్క‌న్న మైండ్‌ని తొలిచేస్తోంద‌ట‌.