RRR మూవీపై రివ్యూలా… ఎప్పుడు రిలీజైంది?

                                 వాయిదాలు క్రైసిస్ లు ఫ్యాన్స్ క్రేజ్‌ని త‌గ్గించ‌వా?

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మునుపెన్న‌డూ లేనంత భారీ హైప్ కి ప్ర‌య‌త్నిస్తున్న‌ చిత్రాలలో ఇది ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ ల‌ను ఓచోట‌ క‌లిపి రాజ‌మౌళి చేస్తున్న అసాధార‌ణ ప్ర‌య‌త్నమిది. ప్రారంభంలో ఆర్‌ఆర్‌ఆర్ 2020 జూలై 30న థియేటర్లలోకి రావాల్సింది. కానీ అనూహ్య ప‌రిణామాల వ‌ల్ల వాయిదా ప‌డింది. ఆ త‌ర్వాత ఈ బహుభాషా చిత్రం 2021 జనవరి 8న థియేటర్లలోకి వస్తుంద‌ని ప్రకటించారు. ఇప్పుడు క‌రోనా క్రైసిస్ ఆ అవ‌కాశాన్ని కూడా దెబ్బ కొట్టింది. 2021 వేస‌వికి అయినా వ‌స్తుందా రాదా? అన్న సందిగ్థ‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ .. రామ్ చరణ్ ఈ చిత్రంలో స్వాతంత్య్ర స‌మ‌ర యోధులుగా న‌టిస్తున్నారు. ఆంగ్లేయుల నుండి తెలుగు నేల విముక్తి కోసం పోరాడే తెలంగాణ యోధుడు కొమరం భీమ్.. ఆంధ్రా వీరుడు అల్లూరి సీతారామరాజు  యంగర్ వెర్షన్లు సినిమా ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తాయ‌ని తెలుస్తోంది. సినీ ప్రేమికులు ఈ సినిమా రాక కోస‌మే వెయిటింగ్. దీనిపై నిరంత‌రం సోస‌ల్ మీడియా లో ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది. కొంద‌రు అయితే ఏకంగా RRR మూవీ రివ్యూలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. అస‌లు ఆడియెన్ ఎమోష‌న్ ఎలా ఉంది? అన్న‌ది ఈ రివ్యూలు చ‌దివితే అర్థ‌మ‌వుతుంది.

నా ద‌గ్గ‌ర‌ #RRR కోసం ఒక అదనపు టికెట్ ఉంది. ఎవరైనా కావాల‌ని కోరుకుంటే నాకు మెసేజ్ చేయకండి ..అంటూ అభిమానం చూపించాడు ఓ వీర ఫ్యాన్.  రామ్‌చరన్ ఎప్పటికీ బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ పార్ట్ – 2 కూడా ఉంది చూపించు. 2025 లో ఈ మూవీ విడుదలవుతుందా? అని అడిగాడో అభిమాని. దానికి స్పందిస్తూ “అంతా బాగుంటే .. ఈ రోజు ఇలా రాచ్చ  అయ్యేది కాదు. సిల్వర్ స్క్రీన్‌లో టైటిల్ బిజిఎమ్‌ను ఊహించుకోండి “ అంటూ వేరొక అభిమాని రిప్ల‌య్ ఇచ్చాడు. వా క్యా సినిమా హే రా భాయ్ ఎన్టీఆర్ అన్నా ఐచిపాడేసిండు… ..! ఆర్‌సి లుక్ బావుంది.. సిబ్బంది ప‌నితీరు అద్భుతంగా ఉంది.. అంటూ ఒక అభిమాని అభిమానం కురిపించారు.

ఈ ర‌చ్చంతా చూస్తుంటే అస‌లు ఆర్.ఆర్.ఆర్ పై అభిమానుల క‌సి ఎలా ఉందో అంచ‌నా వేయొచ్చు. ఎన్నిసార్లు వాయిదా ప‌డినా.. క్రైసిస్ లో ఇరుక్కున్నా.. ఎక్క‌డా క్రేజు త‌గ్గ‌లేద‌నేందుకు ఇదే ప్రూఫ్‌.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles