నేను సంగీత దర్శకుణ్ణి కావడానికి కులశేఖరే కారణం

కష్టంలో వున్నప్పుడు ఒకలా , సుఖంలో వున్నప్పుడు మరోలా మాట్లాడేవాడు నిజమైన స్నేహితుడు కాదంటారు. “స్నేహం  గురించి ప్రస్తావన వచ్చినప్పుడు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ స్పందించాడు. తన జీవితంలో మర్చిపోలేని స్నేహితుడు గీత రచయిత కులశేఖర్  అలాంటి మంచి మిత్రుడు కులశేఖర్ దొంగ గా  మారిపోయి జైలు  జీవితం అనుభవిస్తున్నాడని తెలిసి చాలా బాధ పడ్డాను నిజానికి నేను సంగీత దర్శకుడనయ్యానంటే అందుకు కులశేఖరే కారణం, ఆయన చెప్పక పొతే నేను సంగీత దర్శకుడిని అయ్యేవాడినే కాదు” అని చెప్పాడు ఆర్పీ పట్నాయక్ . కులశేఖర్ , ఆర్పీ  పట్నాయక్ ఇద్దరు స్నేహితులు . ఎన్నో హిట్ చిత్రాలకు కలసి పనిచేశారు . అయితే కులశేఖర్  మానసికంగా దెబ్బతిని  గుళ్ళల్లో దొంగతనము చెయ్యడం  ఎవరు ఊహించని విషయం .