(ధ్యాన్)
450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్.. ముగ్గురు సూపర్‌స్టార్స్ కాంబినేషన్‌లో సినిమా అంటే ఎన్ని అంచనాలుంటాయో అర్థం చేసుకోండి. ఆ సినిమాయే 2.0`. సూపర్స్ స్టార్స్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజనీకాంత్, అక్షయ్‌కుమార్, స్టార్ డైరెక్టర్ శంకర్. వీరి కాంబినేషన్‌లో సినిమాను అనౌన్స్ చేయగానే ఎలా ఉంటుందోనని భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2010లో విడుదలైన `రోబో` సీక్వెల్ ఇదన్న సంగతి కూడా తెలిసిందే.
రోబోలో హీరో సైంటిస్ట్ రజనీకాంత్ చిట్టి అలియాస్ మరో రజనీకాంత్ రోబోను క్రియేట్ చేస్తాడు. చివరకు అది విలన్‌గా మారిపోతుంది. దాన్ని నాశనం చేయడంతో పార్ట్ వన్ పూర్తవుతుంది. ఇప్పుడు సీక్వెల్ `2.0`లో చిట్టి అవసరం రావడంతో మళ్లీ దాన్ని యాక్టివేట్ చేస్తారు. ఇంతకు చిట్టి అవసరం ఏమొచ్చిందనేదే సినిమా. ఇటీవల విడుదలైన టీజర్ ఆధారంగా సెల్‌ఫోన్స్ చుట్టూ కథ తిరుగుతుందని అర్థమవుతుంది. అయితే కథ ఏంటంటే.. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ మనుషులు సెల్‌ఫోన్స్ వాడకాన్ని ఎక్కువ చేశారు. రోజుకొక మోడల్ మార్కెట్లోకి వస్తుంది. అంతే కాకుండా రిలయన్స్, ఎయిర్ టెల్, టాటా అంటూ సర్వీస్ ప్రొవైడర్స్ సెల్‌ఫోన్ టవర్స్ ఎక్కువగా కడుతున్నారు. వీటి వల్ల రేడియేషన్ చాలా పెరిగిపోతుంది. ఒకవైపు అడవులు నాశనం చేస్తున్నారు. రేడియేషన్ పెంచేస్తున్నారు. అందువల్ల పక్షుల మనుగడ తగ్గిపోతుంది. దీంతో పక్షులన్నీ మానవాళిపై పగ పడతాయి. అందుకోసం వాటి పక్షిరాజు అక్షయ్‌కుమార్ సహాయం కోరుతాయి. అప్పుడు పక్షిరాజు, పక్షులన్నీ భూమిపై దండెత్తుతారు. వాటిని ఎదుర్కొనడానికి మానవులు ఏం చేశారు? చిట్టి వారికి ఎలాంటి సహకారం అందించాడనేదే సినిమా కాన్సెప్ట్ అట.