కులం కూడు పెడుతుందా? అంటారు. కానీ కులం రాజ్యాధికారం కట్టబెడుతుందని ప్రూవైంది. కులం అధికారం ఇస్తుంది. ఉద్యోగాలిస్తుంది. ఇంకేదైనా ఇస్తుందని ప్రూవైంది. ఇప్పుడు కమర్షియల్ సినిమాకి కూడా ఆ కులం ఉపయోగపడుతోంది. కాదు కులాన్ని అలా ఉపయోగించుకునేందుకు వివాదాల ఆర్జీవీ ప్లాన్ చేస్తున్నారు.
`కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` అంటూ ఆర్జీవీ మరో కల్లోలానికి తెరతీసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ ఇటీవల `ఇస్మార్ట్ శంకర్` సక్సెస్ సెలబ్రేషన్స్ లో మందు పార్టీల్లో మునిగి తేలాడు. ఆ మత్తు వదిలి ప్రస్తుతం తానేం చేయబోతున్నాడో క్లారిటీకి వచ్చినట్టే కనిపిస్తోంది. ఉన్నట్టుండి `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` ప్రచారం అంటూ వేడి పెంచుతున్నాడు.
ది మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ ఫిలిం
ఫస్ట్ సాంగ్ ట్రైలర్ రేపు శుక్రవారం (ఆగస్టు 9) ఉదయం 9 గంటలకు రిలీజ్ అవుతుంది అంటూ ప్రకటించాడు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి.. భవిష్యత్తుకు సంబంధించిన కథ. ఇది నిజంగా అసలు వివాదాస్పదం కాని కథ, చంద్రబాబు నాయుడు పై ఒట్టు!! అంటూ ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది. ఏదో ఒక వివాదం లేనిదే ప్రచారానికి ముందుకు రాని వర్మ మరోసారి అదే పంథాలో ఫ్రీపబ్లిసిటీ ప్లాన్ చేశాడని అర్థమవుతోంది.