చంద్ర‌బాబు డూప్.. ఆర్జీవీకి చిక్కాడోచ్

అచ్చం బాబు లాగే ఉన్నాడే

`క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు`.. ఆర్జీవీ మార్క్ ఎటెంప్ట్ ఇది. `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` త‌ర‌హాలోనే జ‌నాల‌కు ఈ టైటిల్ వెంట‌నే క‌నెక్ట‌యిపోయింది. నిరంత‌రం ఏదో ఒక వివాదాన్ని కెలుక్కోవ‌డం ద్వారా తాను లైమ్ లైట్ లో ఉండ‌డం అనే ఫార్ములాని ఆర్జీవీ ఈసారి కూడా ఉప‌యోగిస్తున్నాడు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌కీయాలు మొద‌లు జాతీయ రాజ‌కీయాల వ‌ర‌కూ ప్ర‌తిదీ ట‌చ్ చేస్తున్నాడు. మాజీ సీఎం చంద్ర‌బాబు, ప్ర‌స్తుత సీఎం వై.య‌స్.జ‌గ‌న్, న‌రేంద్ర మోదీ, అమిత్ షా, రోజా, ప‌వ‌న్ క‌ల్యాణ్, లోకేష్ నాయుడు, నారా బ్రాహ్మ‌ణి, నారా దేవాన్ష్‌,దేవినేని ఉమ‌, కేసినేని నాని, కోడెల శివ ప్ర‌సాద్, గంటా శ్రీ‌నివాస‌రావు, సుజ‌నా చౌద‌రి, అచ్చ‌య్య నాయుడు, స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం, స్పీక‌ర్ బుచ్చ‌య్య చౌద‌రి, ఎస్పీ గౌత‌మ్ త‌దిత‌రుల పాత్ర‌లు ఈ సినిమాలో ఉండ‌నున్నాయి.

చంద్ర‌బాబు డూప్..ఇదేంద‌య్యో ఆర్జీవీ

ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు ముగింపులో ఉన్నాయి. త్వ‌ర‌లోనే సినిమాని ప్రారంభించ‌నున్నారు. ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఇందులో కీల‌క పాత్ర‌ధారుల్ని ఎంపిక చేస్తున్నాడు. ఇంత‌కుముందు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ లుక్ ని రిలీజ్ చేశాడు. ఆ పాత్ర‌లో డూప్ ని చూసిన ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆర్జీవీపై ఓ లెవ‌ల్లో ఫైర‌య్యారు. తాజాగా ఏపీ మాజీ సీఎం, తెలుగు దేశం అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు లుక్ ని రివీల్ చేశాడు. ఈ రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్ ఎవ‌రో గెస్ చేయండి అంటూ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేశారు ఆర్జీవీ. అచ్చం అదే పండు గ‌డ్డం.. కొర‌కొర చూపులు.. చేత్తో క‌ళ్ల‌ద్దాలు ప‌ట్టుకుని ఖ‌ద్దరు దుస్తుల్లో చంద్ర‌బాబు రూపం అచ్చం అలానే క‌నిపిస్తోంది. డూప్ ని బాగానే సెట్ చేశాడు కానీ.. ఈ డూప్‌ని చూశాక తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎలా రియాక్ట్ కానున్నారో చూడాలి. ఆర్జీవీ ఏం చేసినా లోక‌క‌ళ్యాణం కోస‌మే అని స‌రిపెట్టుకుంటే ఓకే.. లేదూ రాళ్లు రువ్వితేనే క‌ష్టం!