అకిరా నందన్ పై రేణు దేశాయ్ ఆశలు

అకిరా నందన్ పై రేణు దేశాయ్ ఆశలు

రేణూ దేశాయ్ తెలుసుగా , పవన్ కళ్యాణ్ మాజీ భార్య. ఆమె హఠాత్తుగా తన మకాంను పూణే నుంచి హైద్రాబాద్ కు మార్చుతున్నట్టు ప్రకటించింది . ఇందుకు కారణం కూడా రేణూ తెలిపింది .తాను ఓ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించబోతున్నానని , ప్రతిసారి పూణే నుంచి హైదరాబాద్ రావడం కష్టమని చెప్పింది . అయితే రేణు మనసులో వేరే ఆలోచన ఉందనిపిస్తుంది .

పవన్ కళ్యాణ్ తో తెగ తెంపులు చేసుకున్న తరువాత కుమారుడు అకిరా నందన్ , కుమార్తె ఆధ్య తో పూణే మకాం మార్చింది .కొన్నాళ్ల తరువాత మరో వివాహం చేసుకుంటానని ప్రకటించగానే పవన్ అభిమానులు విమర్శలు కురిపించడం మొదలు పెట్టారు . సోషల్ మీడియాలో కూడా ఎన్నో కామెంట్స్ వచ్చాయి . దీంతో రేణు తీవ్ర మనస్తాపం చెందింది . మొత్తానికి ఆ వివాహం రద్దయిపోయింది .
ఈలోగా రేణు తన కుమారుడు అకిరా కు దగ్గర చేసింది . 

హైద్రాబాద్ కు మకాం మార్చితే తాను సినిమాల్లో నటించవచ్చు . తన కుమారుడు భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవచ్చు. . పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లి మళ్ళీ సినిమాలు చెయ్యనంటున్నాడు . పవన్ కుమారుడు గా అకీరాను హీరోగా చేస్తే అభిమానులు ఆదరించే అవకాశం వుంది . అందుకే రేణు దేశాయ్ మాస్టర్ ప్లాన్ తోనే హైదరాబాద్ కు మకాం మార్చుతున్నట్టు తెలుస్తుంది