‘మిస్ట‌ర్ మ‌జ్ను’ :’ మిస్టర్’ అని పెట్టడానికి కారణం?!

అఖిల్, హలో తరువాత అఖిల్ అక్కినేని నటించిన మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఈ సినిమాలో ప్లే బాయ్, షార్ట్ టైమ్ లవర్ పాత్రల్లో అఖిల్ కనిపించబోతున్నాడు. ఇక మజ్ను టైటిల్ తో గతంలో రెండు సినిమాలు వచ్చాయి. రెండు మంచి సక్సెస్ ని సొంతం చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో మజ్ను అనే టైటిల్ పెట్టచ్చు కదా…మిస్టర్ మజ్ను అని ఎందుకు పెట్టారనే సందేహం చాలా మందికి కలిగింది. ఈ విషయమై అఖిల్ వివరణ ఇచ్చారు.

అఖిల్ మాట్లాడుతూ… “మిస్టర్ అని పెట్టడానికి ప్రత్యేకమైన కారణాలు అయితే ఏమి లేవు. కాకపోతే ఓన్లీ మజ్ను అని పెడితే కొంచెం ఎక్కడో ట్రాజడీ ఫీలింగ్ ఉంటుందేమో అని, వెంకీ మజ్నుకి ముందు మిస్టర్ అని పెట్టాడు. అలాగే మిస్టర్ పెట్టడం వల్ల, సినిమాలోతను ఒక మోడ్రన్ మజ్నును చూపించబోతున్నాడనే సెన్స్ ను కూడా హైలెట్ చెయ్యొచ్చు అనే ఆలోచనతో వెంకీ అలా టైటిల్ పెట్టడం జరిగింది. ఓవరాల్ గా మజ్ను అనే టైటిల్ బాగా కలిసొచ్చింది మా ఫ్యామిలీకి”. అని అన్నారు.

ఇక ఈ చిత్రం ట్రైలర్ రీసెంట్ గా విడుదలై మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం అందించారు. ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 25న విడుదలకానుంది. అఖిల్ ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మరో వైపు ఈ చిత్రానికి సోలో రిలీజ్ కూడా కలిసిరానుంది. మరి ఈ చిత్రంతోనైనా అఖిల్ మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడోలేదో చూడాలి.