సినీ నటుడు, రాజకీయ నేత సహరికృష్ణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలికి కారులో వెళ్తుండగా నార్కట్ పల్లి వద్ద అన్నెపర్తి వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సమయంలో కారులో హరికృష్ణతోపాటు మరో ఇద్దరు ఉన్నారు.
కారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో ముగ్గురమున్నామని, హరికృష్ణ గారే కారు నడుపుతున్నారని తెలిపారు. కారు 120 కి.మీ ల వేగంతో ఉందని ఒక రాయిని ఎక్కడంతో క్రాస్ అయ్యి డివైడర్ ను ఎక్కి ముందు వాహనం ను డీకొని కారు పల్టీ కొట్టిందని ఆయన తెలిపారు. తాము సీటు బెల్టులు పెట్టుకోవడంతో కారులోనే ఉండిపోయామని, హరికృష్ణ గారు బెల్టు పెట్టుకోకపోవడంతో కారులో నుంచి ఎగిరి రోడ్డుపై పడ్డారని తెలిపారు. హరికృష్ణ గారికి స్టీరింగ్ బలంగా గుద్దుకొని ఎగిరి రోడ్డు మీద పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. రోడ్డుపై కారు రాయిని ఎక్కకుంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు.
వారిలో ఒకరైన హరికృష్ణ స్నేహితుడు శివాజీ ప్రమాదంపై మీడియాకు వివరణ ఇచ్చారు.ఆయన ఏమన్నారో, ప్రమాదం ఎలా జరిగిందో శివాజీ వీడియో కింద ఉంది చూడండి.