తమన్నా పెళ్లికి సంబంధించి కొన్నాళ్ళుగా అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి. కొద్ది రోజులు ఆమె కో స్టార్స్ తో ప్రేమాయణం నడుపుతుందని ప్రచారం చేయగా, ఆ తర్వాత ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో చెట్టాపట్టాలు వేస్తుందని అన్నారు. ఈ వార్తలని తమన్నా అప్పట్లో కొట్టి పారేసింది. తాజాగా తన పెళ్లిపై స్పందించింది తమన్నా. పెళ్లి వయసు వచ్చిన నాకు మా అమ్మ మంచి వరుడిని వెతికే పనులలో ఉంది. పెళ్లి విషయంలో పూర్తి నిర్ణయం మా అమ్మదే. ఎవరిని వివాహం చేసుకోవాలనేది మా అమ్మ నిర్ణయిస్తారని తమన్నా చెప్పుకొచ్చింది. తాను ఎవరినీ ఇంతవరకూ ప్రేమించలేదని, ఎవరినైనా ప్రేమిస్తే ముందుగా మీడియాకే చెబుతానని అంటోంది. కాగా, ప్రస్తుతం తమన్నా విశాల్ కు హీరోయిన్ గా ‘పెట్రోమ్యాక్’ అనే సినిమాలో నటిస్తోంది. తమన్నా నటించిన దటీజ్ మహాలక్ష్మీ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది.