త్రివిక్రమ్ క్షమాపణ చెప్తారా..ఆయన ఆలోచన ఏంటి?

ఈ మధ్యకాలంలో ఏ సినిమాకూ రానంత వ్యతిరేకత ‘అరవింద సమేత’ చిత్రానికి వస్తోంది. రిలీజైన నాటి నుంచీ ఈ చిత్రానికి ఏదో ఒక వివాదం వెంటాడుతోంది. ఓ ప్రక్కన కాపీ వివాదం..మరో ప్రక్క తమ ప్రాంతాన్ని సినిమాలో అవమాన పరిచారంటూ సీమ విద్యార్ది సంఘం ఇస్తున్న వార్నింగ్ లు. ఇవన్నీ త్రివిక్రమ్ ని కలవరపరిచే అంశాలే. అజ్ఞాతవాసి పరాజయం నుంచి ఆయన కోలుకోవటానికి తీసిన ఈ సినిమాలు ఇలాంటి సమస్యలను
మోసుకొస్తుందని ఊహించి ఉండరు. తాజాగా ఆయన రాసిన డైలాగ్స్ ని సినిమాలో నుంచి తొలిగించి, బహిరంగ క్షపాపణ చెప్పాలని సీమ విద్యార్ధి సంఘం హెచ్చరికలు జారీ చేసింది.


మా రాయల సీమ కరువు కథావస్తువు కాదా? మా ఆకలి కథా వస్తువు కాదా? వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. అవేవీ చూపించకుండా సీమ ప్రజలపై ఫ్యాక్షనిస్టు ముద్ర వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకటన చేసారు.


అంతే కాకుండా తమ సీమ వాసుల మనోభావాలు కించపరిచేలా ఉన్న డైలాగ్‌లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. నోటికొచ్చినట్లు డైలాగ్‌లు రాస్తే తాట తీస్తాం అంటూ రాయలసీమ విద్యార్ధి సంఘాలు త్రివిక్రమ్ ని హెచ్చరించాయి.

ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ వారు కోరినట్లు క్షమాపణ చెప్తారా..డైలాగ్స్ తొలిగిస్తారా..ఏం డెసిషన్ తీసుకుంటారు, సినిమాని సినిమాలాగే చూడాలంటూ ప్రకటన విడుదల చేస్తారా  అనేది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.