డిస్కోరాజా` న్యూలుక్ అదిరిందిగా!

Disco Raja First Look

Ravi Tejas’s upcoming movie is Disco Raja. On the eve of the new year, the makers of the movie released the stunning first look of Disco Raja.

మాస్ మ‌హారాజా ర‌వితేజ సినిమా వ‌చ్చి ఏడాది అవుతోంది. 2018 చివ‌రిలో `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ర‌వితేజ నుంచి 2019లో ఒక్క సినిమా కూడా రాలేదు. దాదాపు ఏడాది విరామం త‌రువాత ర‌వితేజ వ‌రుస‌గా రెండు చిత్రాల్లో న‌టిస్తున్నారు. 2020లో రెండు చిత్రాల‌తో హంగామా చేయ‌బోతున్నారు. లేట్‌గా వ‌చ్చినా లేటెస్ట్‌గా రాబోతున్నానంటూ సంకేతాలిస్తున్నారు. ర‌వితేజ న‌టిస్తున్నతాజా చిత్రాలు `డిస్కోరాజా`, క్రాక్‌`.

`ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` ఫేమ్ వి. ఐ. ఆనంద్‌తో `డిస్కోరాజా`, `బ‌లుపు` లాంటి హిట్ చిత్రాన్నిచ్చిన గోపీచంద్ మ‌లినేనితో `క్రాక్‌` చిత్రాల్ని ప‌ట్టాలెక్కించారు. ఈ రెండు చిత్రాల‌తో బ్యాక్ టూ బ్యాక్ హిట్ల‌ని సొంతం చేసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారు. 2018లో వ‌రుస ఫ్లాప్‌ల‌ని సొంతం చేసుకున్న ర‌వితేజ ఈ రెండు చిత్రాల‌తో స‌క్సెస్ ట్రాక్‌లోకి రావాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. తొలిసారి సైంటిఫిక్ ఫిక్ష‌న్ క‌థ‌తో మాస్‌రాజా చేస్తున్న చిత్రం `డిస్కోరాజా`. రెట్రో గెట‌ప్‌లో ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ ఈ సినిమాపై ఆస‌క్తిని క‌లిగించింది. తాజాగా రిలీజ్ చేసిన మాస్ రాజా స్టైలిష్‌ ట్రెండీ లుక్ కూడా ఆక‌ట్టుకుంటోంది.

సిగ‌ర్ కాలుస్తూ  మాస్ రాజా ర‌వితేజ తీక్ష‌ణంగా ఆలోచిస్తూ చూస్తున్న న్యూ లుక్ టెర్రిఫిక్‌గా వుంది. ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌లోనే ఇదొక రెట్రో థ్రిల్ల‌ర్ అని రివీల్ చేసిన ద‌ర్శ‌కుడు న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన స్టిల్ లోనూ ఇదొక సీరియ‌స్‌గా సాగే రివేంజ్ థ్రిల్ల‌ర్ అనే సంకేతాల్ని అందించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. రైజింగ్‌లో వున్న త‌మ‌న్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని రెండు పాట‌ల్ని ఇప్ప‌టికే రిలీజ్ చేశారు. అవి ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేయాల‌ని ప్లాన్  చేస్తున్నారు.