భారీ స్థాయిలో పారితోషికాలు.. లగ్జరీ సదుపాయాలు.. ఇవన్నీ ఒక్క ఫ్లాపుతో తెరమరుగైపోతుంటాయన్నది ఇండస్ట్రీలో జగమెరిగిన సత్యం. అచ్చం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్. హీరోగా మారాక 2 నుంచి 3 కోట్లు తీసుకున్న సునీల్ వరుస ఫ్లాపులు రావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఒక్కో సినిమాకు రోజుల లెక్కన రెమ్యునరేషన్ తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
సునీల్ ఒక్క రోజుకి ఛార్జ్ చేస్తున్న మొత్తం 2 నుంచి 3 లక్షలని తెలిసింది. అది కూడా పూర్తి డేని కేటాయిస్తేనే లేదంటే అందులోనూ హెచ్చుతగ్గులు కామన్ అని టాక్ వినిపిస్తోంది. ఇటీవల `డిస్కోరాజా`తో విలన్ అవతారం ఎత్తిన సునీల్ సినిమా పోయినా తన పాత్రకు మంచి స్పందన రావడంతో దాన్నే కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం `కలర్ ఫొటో`లో విలన్‌గా నటిస్తున్న సునీల్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోయాడని పూలమ్మిన చోట కట్టెలమ్మడం అంటే ఇదే అని కొంత మంది పెదవి విరుస్తున్నారు.