ఇక ఎలాంటి పాత్రకైనా పాయల్ రెడీనట!?

పాయల్ రాజ్ పుత్ ఒకే ఒక్క సినిమాతో ఎంతటి సంచలనానికి దారితీసిందో తెలిసిందే.. టాలీవుడ్ లో ఆర్.ఎక్స్100 సినిమా తెచ్చిన ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా తో పాయల్ రాజ్ పుత్ కుర్రకారుని ఎంతగానో తన వైపునకు తిప్పుకుంది. డీప్ లిప్ లాక్స్, గ్లామర్ సీన్స్ లో రెచ్చిపోయింది. అంతేకాదు ఎమోషనల్ సీన్స్ లోను తన స్టామినాను నిరూపించుకుంది. అయితే.. ఆ తర్వాత టాలీవుడ్ లో బోలెడన్ని అవకాశాలు వచ్చి స్టార్ హీరోయిన్ అయిపోతుందనుకున్నారు అంతా . నిజం చెప్పాలంటే అవకాశాలు వచ్చాయి. కానీ అన్ని మొదటి సినిమా తరహాలోనే బోల్డ్ కథలు.

అంతేకాదు పాయల్ కి కథ చెప్పిన దర్శకులందరు తనని అదే కోణంలో ఆలోచించి చెప్పారు తప్ప మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ గాని, మిగతా జోనర్స్ కి సంబంధించిన కథ లు చెప్పలేదట. మధ్యలో ఓ ఐటెం సన్గ్ చేసి చేతులు కాల్చుకుంది. అంతే కాదు.. అలాంటి సినిమాలు చేయను చేయను అంటూనే ‘ఆర్ డి ఎక్స్ లవ్’ చేసి మరో సారి పూర్తిగా దెబ్బతిన్నది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బొక్క బోర్లా పడిపోయినది. ఆ తర్వాత మరో సినిమా ‘వెంకీ మామ’ చేసింది. అయినా ఫలితం తనకు ఈ మాత్రం దక్కలేదు.

రవితేజతో ‘డిస్కో రాజా’ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో విసుగు పుట్టి ఆ సినిమాలను వదులుకుందట. అయితే.. ఇప్పుడే చేసిన తప్పు తెలుసుకుందట. ఇకపై ఎలాంటి పాత్రైనా చేయడానికి రెడీ అంటోందిట. కలిసిన దర్శకులందరి వద్ద ఎలా చేయడానికైనా సిద్ధమే అంటూ ప్రాధేయ పడుతోందిట.