“విజయ్ దేవరకొండ తో వున్నరిలేషన్ … ?” రష్మిక మందన్న
డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండతో కలసి నటించిన రష్మిక మందన్నపై ఎన్నో పుకార్లు షికాయారు చేస్తున్నాయి . విజయ్ దేవరకొండ , రష్మిక మధ్య రిలేషన్ నడుస్తుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి . డియర్ కామ్రేడ్ సినిమా విడుదల సందర్భంగా జర్నలిస్టు లతో రష్మిక సమావేశమైంది . రష్మిక తో జర్నలిస్టులు ఇదే విషయాన్ని ప్రస్తావించారు . అయితే ఇలాంటి ప్రశ్న ఎదురవుతుందని గ్రహించిన రష్మిక … “డేటింగా ? నేనా ? విజయ్ దేవరకొండ తోనా ?” అంటూ ఓ చిరు నవ్వు నవ్వేసింది .
ఎంతైనా కన్నడ భామ కదా ? తన కెరీర్ ను దృష్టిలో పెట్టుకొని రష్మిక తెలివైన సమాధానము చెప్పింది . విజయ్ దేవరకొండ తో రష్మిక తొలిసారి “గీత గోవినడం సినిమాలో నటించింది . ఆ సినిమాలో రష్మిక విజయ్ లిప్ లాక్ కుర్రాకారుకె కాదు అందరికీ తెగ నచ్చింది . అందుకే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది . ఈ జంటతో ఇప్పుడు “డియర్ కామ్రేడ్ ” నిర్మాణమైంది . ఈ సినిమాలో కూడా హాట్ గా లిప్ లాక్ పెట్టేశారు . ఇది చూసిన తరువాత వీరిద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఉందనుకుంటున్నారు .
ఇప్పుడు రష్మిక కన్నడంలో “పొగరు ” , తెలుగులో మహేష్ బాబుతో “సరిలేరు నీకెవ్వరూ ” , వెంకీ కుడుములు “భీష్మ “, సుకుమార్ ” ఏ ఏ 20″ తమిళంలో “కార్తీ 19” చిత్రంలో నటిస్తుంది . తమిళంలో మరో సినిమా చేస్తున్నట్టు చెప్పింది . కాబట్టి ఇప్పుడు విజయ్ దేవరకొండతో రిలేషన్ షిప్ ఉందని చెబితే తన కెరీర్ కి ఎఫెక్ట్ ఇస్తుందని రష్మిక భావించి ఉండవచ్చు . అందుకే తెలివిగా అలా చిప్పిందని అనుకోవచ్చా ? లేదా విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న మధ్య వృత్తి సంబంధమైన బంధం తప్ప వ్యక్తిగత అనుబంధం లేదా ?