Sekhar Kammula: సినిమాలో రష్మిక సాంగ్ తీసేయడానికి కారణం అదే.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల!

Sekhar Kammula: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, రష్మిక మందన కలిసి నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. ఇందులో నాగార్జున కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం రోజున భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. విడుదలైన మొదటి రోజే ఈ మూవీకి పాజిటివ్ టాక్‌ రావడంతో నాగ్ ఫ్యాన్స్‌తో పాటు ధనుశ్ అభిమానులు సైతం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే తాజాగా మూవీ మేకర్స్ సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల నాగార్జునలకు కొన్ని ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నలకు నవ్వుతూనే ఓపికగా సమాధానం ఇచ్చారు శేఖర్ కమ్ముల. ఈ సినిమాలో పీపీ..డుమ్ డుమ్‌ అనే రష్మిక సాంగ్‌ ను ఎందుకు తొలగించారంటూ దర్శకుడికి ప్రశ్న ఎదురు కాగా శేఖర్ కమ్ముల క్లారిటీ ఇస్తూ.. పాన్ ఇండియా సినిమా కావడం వల్ల కొన్ని అలాంటి సాంగ్స్‌ ఉండాలకున్నాము. అయితే ఈ సాంగ్‌ ను కావాలని మేము తీయలేదు. కానీ కథలో ఎక్కడైనా ఈ పాట అడ్డుగా వస్తుందేమోనని వద్దనుకున్నాము.

వేరే మంచి సీన్‌ తొలగించి ఈ పాటను పెట్టడానికి నేను కథను అలా రాసుకోలేదు. ఈ చిత్రంలో ఒక్క సీన్‌, ఒక్క డైలాగ్‌ తీసేసినా ఈ సినిమా ఉండదు అలా కథ రాసుకున్నాను అని శేఖర్ కమ్ముల తెలిపారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ థియేటర్లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ ధనుష్ నటనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.