Rashmika: రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు ఈమె పలు సినిమాలో షూటింగ్ పనులలో బిజీ అవుతుండగా మరోవైపు ఈమె నటించిన సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా బిజీగా ఉన్నారు. ఇలా ఏమాత్రం తీరిక లేకుండా రష్మిక బిజీగా గడుపుతున్నారు.
ఇదివరకే రష్మిక చావా, పుష్ప 2 వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలు వేసుకున్నారు. ఇక త్వరలోనే సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సికిందర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈ నెల 30వ తేదీ విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రష్మిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ రష్మికకు కాలికి తగిలిన గాయం గురించి అడిగారు. గత కొన్ని నెలల క్రితం ఈమె జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఉండగా కాలికి గాయం అయిన సంగతి తెలిసిందే. ఇలా కాలికి గాయం కావడంతో ఈమె కొద్ది రోజులు నడవలేని స్థితిలోకి వెళ్లారు.
ఇక ఛావా సినిమా ప్రమోషన్లలో కూడా వీల్ చైర్ సహాయంతో ఈమె హాజరైన సంగతి తెలిసిందే ఇలా ఎంతో నొప్పితో ఇబ్బందిపడిన రష్మిక తాజాగా ఈ గాయం గురించి మాట్లాడుతూ ప్రస్తుతానికైతే పరవాలేదని అయినప్పటికీ తాను సినిమాలలో బిజీ అవుతున్నానని తెలిపారు. ఈ గాయం పూర్తి మానడానికి మరో 9 నెలల సమయం పడుతుంది అంటూ రష్మిక తన కాలికి తగిలిన గాయం గురించి తాజా సమాచారాన్ని ఇచ్చారు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.