ఒకసారి చెబితే, వందసార్లు చెప్పినట్టే – రష్మిక!

Rashmika

ఒకసారి చెబితే, వందసార్లు చెప్పినట్టే – రష్మిక!

టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ డమ్ ని కైవసం చేసుకున్న బ్యూటీల్లో రష్మిక కుడా చేరుతుంది. ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఆడి పాడింది. ఇప్పుడు టాలీవుడ్ లో రష్మిక అంటేనే హాట్ హాట్ గా చెప్పుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలోనూ బంపర్ ఆఫర్ కొట్టేసింది.

తెలుగు అమ్మాయి కాకపోయినా, తెలుగు నేర్చుకొని.. అచ్చమైన తెలుగు కథానాయిక అయిపోయింది. ”తెలుగు భాష ఎంత త్వరగా నేర్చుకుంటానని నేను అనుకోలేదు, సెట్లో ఎవరేం మాట్లాడినా వినేదాన్ని. చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు శ్రద్ధగా వినేదాన్ని. నాకెవరైనా ఒకసారి చెబితే, వందసార్లు చెప్పినట్టే. మైండ్ లో అలా ప్రింటు గుద్దినట్టు గుర్తుండి పోతుంది. అందువల్లే తెలుగు త్వరగా నేర్చుకున్నా. సెట్లో కుడా అంతే! దర్శకుడు ఏదైనా ఒక్కసారి చేబితే అట్టే ఫాలో అయిపోతాను. నా సంభాషణలన్నీ నాకు కంఠతా వచ్చేస్తాయి. వాటిని నాదైన శైలిలో చెబుతా. సహజత్వం అంటే నాకు ఇష్టం. బయట ఎలాఉంటానో కెమెరా ముందూ అలానే ఉండడానికి ప్రయత్నిస్తా.

తెలుగులో నా చిత్రాలు,ఆయా చిత్రాల్లో నా పాత్రలు అన్నీ నాకు నచ్చి చేసినవే. ఎవరో బాగుందని చెబితే నేను ఆ పాత్రలను ఎంపిక చేసుకోలేదు. నా స్టైల్ నాదే..!’ అంటూ చెప్పుకొచ్చింది.