ప్చ్.. ‘గీత గోవిందం’ హీరోయిన్ పై ఆ వార్త నిజం కాదంట,రూమరేట

ఛలో చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మందన్న గీత గోవిందం సినిమాతో యూత్‌లో మంచి సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, కన్నడ భాషల్లో బిజీగా ఉంది. తెలుగులో విజయ్‌దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నది. ఇదిలావుండగా రష్మిక మందన్న తమిళంలో బంపర్‌ఆఫర్‌ను సొంతం చేసుకుందనే వార్తలు హల్ చల్ చేసాయి.

‘సర్కార్‌’ సూపర్‌ సక్సెస్‌ తర్వాత హీరో విజయ్‌ నెక్ట్స్‌ చేయబోయే చిత్రాన్ని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనేది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు చిత్ర యూనిట్ . కానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికా మండన్నా ఫిక్స్‌ అయిపోయారు అని మీడియాలో కొందరు రాసుకొచ్చారు. విజయ్‌ నెక్ట్స్‌ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను చేస్తోందంటూ అందరూ కంగ్రాట్స్ కూడా చెప్పేసారు.

అట్లి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం దాదాపు 125కోట్ల భారీ బడ్జెట్‌తో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ విషయమై రష్మిక స్పందించింది. తనకు ఎలాంటి ఆఫర్ ఆ సినిమా యూనిట్ నుంచి రాలేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతానికి అలాంటి ఆఫరేమీ తనకు లేదని, వస్తే బాగుండును అని ఎదురుచూస్తున్నాను అన్నట్లుగా ట్వీట్ చేసింది. తమిళంలోనూ త్వరలోనే సినిమా చేస్తాను. ఎదురుచూస్తు,నన్ను ప్రోత్సహిస్తున్నవాళ్లందరికీ ధాంక్స్ అంది.

ప్రస్తుతం ఈ భామ ‘ధృవ’ కన్నడ రీమేక్‌ ‘పొగరు’, తెలుగులో విజయ్‌ దేవరకొండతో ‘డియర్‌ కామ్రేడ్‌’, నితిన్‌తో ‘భీష్మ’ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.