మాజీ ల‌వ‌ర్‌ ర‌క్షిత్‌కు ఇంకో గట్టి షాక్ ఇచ్చింది…

                                      (ధ్యాన్)

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్నా.. తెలుగులో దేవ‌దాస్‌తోత్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల‌ను పల‌క‌రించ‌నుంది. మ‌రోవైపు `గీత గోవిందం` త‌ర్వాత విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో `డియ‌ర్ కామ్రేడ్` చిత్రంలో న‌టిస్తుంది. కొన్ని కార‌ణాలో హీరో ర‌క్షిత్‌తో జ‌రిగిన ఎంగేజ్‌మెంట్ బ్రేక‌ప్ అయిన సంగతి తెలిసిందే. ఇలా బ్రేక‌ప్ అయ్యిందో లేదో.. ర‌ష్మిక క‌న్న‌డ సినిమా `వ్రిత్రా` నుండి త‌ప్పుకుంటున్న‌ట్లు ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌కటించింది. ఎందుకంటే ఈ సినిమాలో హీరో ర‌క్షిత్ కావ‌డం గ‌మ‌నార్హం. “వినాయ‌క చ‌వితి పండుగ‌ను అంద‌రూ హ్యాపీగా జ‌రుపుకుని ఉంటార‌ని భావిస్తున్నాను. వ్రిత్రా నుండి త‌ప్పుకుంటున్నాను. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి నిర్ణ‌యం స‌రైంది కాద‌ని తెలుసు. అయితే ఈ విషయాన్ని ద‌ర్శ‌కుడు గౌత‌మ్‌, నిర్మాత‌ల‌కు తెలియ‌జేశాను. వారు అంగీక‌రించారు. నా స్థానంలో వ‌చ్చే వారు ఎవ‌రైనా నా కంటే బాగా న‌టించాల‌ని కోరుకుంటున్నాను. గౌత‌మ్ అండ్ టీమ్‌కు అభినంద‌న‌లు“ అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు. ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వేంటో కానీ.. ర‌ష్మిక మాత్రం ర‌క్షిత్‌కు గట్టి షాకే ఇచ్చింది.